ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థ అంతా సీఎం చంద్రబాబు బినామీల చేతుల్లోనే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభ ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. తన బినామీలను కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.