నెల్లూరు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన సమ్మర్ స్టోరేజీ నీళ్లు ఎందుకూ పనికిరావడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శాసనసభ దృష్టికి తెచ్చారు. జీరో అవర్ లో ఆయనీ అంశాన్ని లేవనెత్తారు. రూ.140 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్లతో నెల్లూరు రూరల్ ఏరియాలోని దక్షిణంవైపు ఉన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ నీళ్లు నెల్లూరు ప్రజలు తాగడానికి కాదు కదా ఎందుకూ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు.