
చండీగఢ్: ఢిల్లీ సరిహద్దుల్లో నెలకుపైగా రైతులు సాగిస్తున్న ఆందోళన ప్రభావం సరిహద్దు రాష్ట్రమైన హరియాణా స్థానిక ఎన్నికల్లో బీజేపీపై పడింది. హరియాణా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీ–జేజేపీ ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కీలకమైన సోనిపట్, అంబాలా, ఉక్లనా, ధరుహిరా స్థానాల్లో బీజేపీ, జేజేపీ వెనుకంజ వేశాయి. ఆదివారం అంబాలా, పంచకుల, సోనిపట్, రేవారి, ధరుహిరా, సంప్లా, ఉక్లనా నగరాల్లో స్థానిక ఎన్నికలు జరిగాయి. సోనిపట్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది, అంబాలాలో హెచ్‌జేపీ పార్టీ గెలుపొందగా పంచకుల, రెవారిలో మాత్రం బీజేపీకి గెలుపు దక్కింది. ఉక్లానా, ధరుహిరాల్లో జేజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment