ఒట్టావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. టొరంటో-సెయింట్.పాల్ స్థానానికి మంగళవారం జగిరిన ఉప ఎన్నికలో ట్రూడో నేృత్వంలోని లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. ఈ స్థానం లిబరల్ పార్టీ కంచుకోట స్థానం. లిబరల్ పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి.. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవర్ట్ చేతిలో ఓడిపోయారు. డాన్ స్టీవర్ట్‌కు 42 శాతం ఓట్లు రాగా, లెస్లీకి 40 శాతం ఓట్లు పడ్డాయి.
టొరంటో-సెయింట్.పాల్ స్థానంలో లిబరల్ పార్టీ గత 30 ఏళ్లుగా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2011లో లిబరల్ పార్టీ తరఫున తక్కువ మంది ఎంపీలు గెలిచినప్పటికీ.. టొరంటో-సెయింట్.పాల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ స్థానాన్ని కోల్పోయిన లిబరల్‌పార్టీకి మొత్తం 338 స్థానాలకు గాను 155 ఎంపీలు ఉన్నారు.
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ ఓటమి ట్రూడోకు పెద్ద ఎదరుదెబ్బ అని రాజకీయల విశ్లేషకులు పేర్కొంటున్నారు. టొరంటో-సెయింట్.పాల్ స్థానంలో ఓటమిపై ప్రధాని ట్రూడో స్పందించారు. ‘ఇవి చాలా కష్టమైన పరిస్థితులు. అందుకే, నేను నా టీం కెనడా ప్రజల అభివృద్ధి కోసం మరింత శ్రమిస్తాం’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment