ఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2021 లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడైన ఆశిష్‌కు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం బెయిల్ ఇచ్చింది.
అయితే ఆశిష్ మిశ్రా ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గతేడాది జనవరిలో ఆశిష్‌కు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది.
‘‘ లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి అన్ని అంశాలను పరిశీస్తున్నాం. 117 మంది వద్ద లక్ష్యాలు తీసుకోండి. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేయాలి’’ అని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ట్రయల్ షెడ్యూల్ చేసుకొని తర్వరగా విచారణ చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది.
2021 లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనలు చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment