Mass resignations
-
డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్
కోల్‌కతా ఆర్టీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వారి నిరసన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జూనియర్ డాక్టర్ల చేస్తున్న నిరసనకు సంఘీభావంగా ఇప్పటివరకు సుమారు 200 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది.ఆ రాజీనామాలన్నీ చట్టబద్ధంగా అవి చెల్లుబాటు కావని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లేఖలలో సామూహిక రాజీనామాల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు రాజీనామాలు చేయడంపై ఇటీవల గందరగోళ పరిస్థితి నెలకొంది. మూకుమ్మడిగా రాజీనామాలను సూచించే కొన్ని లేఖలు మాకు అందుతున్నాయి. అయితే అటువంటి లేఖల్లో సబ్జెక్ట్ ప్రస్తావన లేకుండా కొన్ని పేజీలు జతచేయబడ్డాయి. హోదాలు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం కొన్ని సంతకాలను కలిగి పేపర్లు జతచేయపడ్డాయి. వాస్తవానికి ఈ రాజీనామా లేఖలకు ఎటువంటి చట్టబద్దమైన విలువ లేదు. ఈ రకమైన సాధారణ లేఖలకు చట్టపరమైన ఉండదు’ అని తెలిపారు.#WATCH | Howrah: Chief advisor to West Bengal CM Mamata Banerjee, Alapan Bandyopadhyay says, "There has been confusion recently regarding the so-called resignation of senior doctors working in government medical colleges and hospitals. We have been receiving certain letters which… pic.twitter.com/2jP1dkhCkJ— ANI (@ANI) October 12, 2024 జూనియర్ డాక్టర్ల బృందం గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయడంలో జాప్యం చేస్తుందని, పని ప్రదేశంలో ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందని తోటి డాక్టర్లు తెలిపారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా 5వేల మంది కార్యకర్తల రాజీనామా!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఆయన నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. హస్తం పార్టీకి దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు. తాజాగా గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా సుమారు 5000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు గురువారమే తమ రాజీనామాలను అందించనున్నట్లు తెలిసింది. ఆజాద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు అధిష్టానానికి తెలియజేయటమే దీని ముఖ్య ఉద్దేశంగా స్పష్టమవుతోంది. కొద్ది నెలల్లోనే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ కాంగ్రెస్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మరోవైపు.. జమ్ముకశ్మీర్ ఎన్నికలు సైతం 2023లో జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల రాజీనామా ఒక్కటే కాదు.. ఇటీవల సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా, ఆజాద్‌ల భేటీ హరియాణా కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. గురువారం ఆజాద్‌తో భేటీ అయిన వారిలో ఆనంద్ శర్మ, భూపింద్ సింగ్ హుడా, పృథ్విరాజ్ చావన్‌లు ఉన్నారు. దీంతో గాంధీ కుటుంబానికి, పార్టీకి విదేయతపై ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: కశ్మీర్ లోయలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. ఆజాద్ వెంటే కార్యకర్తలంతా! -
దివిసీమ టీడీపీలో ఉప్పెన
మోపిదేవి (అవనిగడ్డ): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మోపిదేవి మండల టీడీపీ నాయకుల మూకుమ్మడి రాజీనామాలు దివిసీమలో తీవ్ర చర్చలకు దారితీశాయి. మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబం నుంచే ఈ ముసలం పుట్టడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రులు నడకుదటి నరసింహారావు సోదరుడు, కొల్లు రవీంద్ర మేనమామ అయిన జనార్దనరావు అధిష్టానంపై రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఈయన మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతగా, రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. శనివారం ఉత్తర చిరువోలులంకలోని ఆయన ఇంటివద్ద టీడీపీకి, అవసరమైతే ఎంపీటీసీ పదవికి సైతం తాను, తన కుటుంబం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కమ్యూనిస్టు పార్టీలో కొనసాగామని, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు పిలుపు మేరకు ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి టీడీపీకి మండలంలో కంచుకోటగా గ్రామాన్ని బలోపేతం చేశానని చెప్పారు. సర్పంచ్‌గా తాను, తన భార్య జననీకుమారి బాధ్యతలు నిర్వహించామని గుర్తు చేశారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీని చేస్తామని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ పోటీచేయాలని, గెలిస్తే ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో తన భార్య జననీకుమారిని కార్యకర్తలు గెలిపించారని పేర్కొన్నారు. అయితే ఎంపీపీ పదవి ఇవ్వకుండా.. హామీని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను గడ్డిపరకలకన్నా హీనంగా చూస్తున్నారని అన్నారు. అవసరానికి మాత్రమే వాడుకుంటూ అవకాశం ఉన్నా.. తమకు పదవి ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన భార్య జననీకుమారి ఎంపీటీసీ పదవిని కూడా వదులు కోవడానికి సిద్ధంగా ఉందని జనార్దనరావు వివరించారు. కాగా, ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా
సాక్షి,లక్నో: ఒకవైపు కరోనా మహమ్మారి విలయాన్ని సృష్టిస్తోంది. దీంతో సకాలంలో వైద్యం, ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో దిగ్భ్రాంతి కరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాల ఇన్‌చార్జ్‌లు సుమారు 16 మంది సీనియర్ వైద్యులు బుధవారం సాయంత్రం సామూహిక రాజీనామా చేశారు. తమకు ఉన్నతాధికారులనుంచి సహకారం లేకపోగా, వేధింపులకు గురవుతున్నామని వారు ఆరోపించారు. ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జులగా ఉన్న 11మంది వైద్యులు, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఐదుగురు వైద్యులు మొత్తం ఉన్నావ్ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ అశుతోష్ కుమార్‌కు తమ సామూహిక రాజీనామాను సమర్పించారు.అలాగే డిప్యూటీ సిఎంఓ డాక్టర్ తన్మయ్ కు మెమోరాండం సమర్పించారు. కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడానికి తామంతా చాలా అంకితభావంతో పూర్తి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, పైఅధికారులు వేధింపులకు గురిచేస్తూ నియంతృత్వ వైఖరితో ఉన్నారని, అక్రమంగా తమపై చర్యలకు ఉత్తర్వులిస్తున్నారని వాపోయారు. ఎలాంటి వివరణ లేదా చర్చ లేకుండానే జరిమానా చర్యలు తీసుకుంటున్నారని వైద్యులు ఆరోపించారు. మరోవైపు మూకుమ్మడి రాజీనామాల విషయం తనకు తెలియదని డాక్టర్ అశుతోష్ కుమార్ చెప్పారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, జిల్లా మేజిస్ట్రేట్‌తో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చదవండి: గంగానదిలో మృతదేహాలు : యూపీ, బిహార్ మధ్య చిచ్చు -
తిరుగుబాటు..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : అంతర్గత పోరు.. కుమ్ములాటలు ప్రొద్దుటూరు తెలుగుదేశం నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గతంలో పలుమార్లు అధికార టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో సారి బట్టబయలయ్యాయి. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన వర్గపోరు తాజాగా రాజీనామాల వరకు వెళ్లింది. ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి తీరును నిరసిస్తూ సోమవారం మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు తెలుగుదేశంపై తిరుగుబాటు చేస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. వీఎస్ ముక్తియార్ నేతృత్వంలో ఆయన ఇంటి వద్ద నుంచి కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరైన జనంతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. దారి వెంట వారు వరదకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదనుపార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, వరద హఠావో.. టీడీపీ బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజీనామా చేయడానికి వెళ్తున్న కౌన్సిలర్ల వెంట పెద్ద ఎత్తున జనం రావడంతో మున్సిపల్ కార్యాలయం బయట పోలీసులు వారిని అడ్డుకున్నారు. కౌన్సిలర్లు మాత్రమే లోపలికి వెళ్లాలని డీఎస్పీ నాయకులకు సూచించారు. డీఎస్పీ సూచన మేరకు కౌన్సిలర్లు, ప్రధాన నాయకులు కార్యాలయంలోకి వెళ్లారు. కాగా ముందుగా 21 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయాలని నిర్ణయించుకోగా చివరి నిమిషంలో 36వ వార్డు కౌన్సిలర్ మార్తల రామమునిరెడ్డి కూడా రాజీనామా చేశారు. అధికార పార్టీ కౌన్సిలర్ల రాజీనామా విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా రాజీనామా చేయడానికి వెళ్తున్న సమయంలో కూడా కౌన్సిలర్లు బలప్రదర్శనకు దిగడం విశేషం. వరద నియంతలా వ్యవహరిస్తున్నారు రాజీనామా అనంతరం వీఎస్ ముక్తియార్ మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటిలో జరిగే ప్రతి పనిలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇన్చార్జి పేరుతో జోక్యం చేసుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారాడన్నారు. అందుకు నిరసనగా కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు రాజీనామా చేశారని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన వరద స్వార్థం కోసం పని చేస్తున్నారని చెప్పారు. పార్టీలో పూర్వం నుంచి ఉన్న కౌన్సిలర్లు, నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అందుకు నిరసనగా వేల మందితో కలిసి రాజీనామాలను సమర్పించామన్నారు. కౌన్సిలర్ పదవులకు మాత్రమే రాజీనామాలు చేశామని, పార్టీకి కాదన్నారు. పార్టీ అభివృద్ధి కోసం, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. వరదరాజులరెడ్డిపై సీఎంకు, జిల్లా ఇన్చార్జి మంత్రికి, జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామన్నారు. అధిష్టానం సంప్రదింపులు జరిపి వరదరాజులరెడ్డిపై చర్యలు తీసుకుంటే తప్ప రాజీనామాలను ఉపసంహరించుకోమన్నారు. రాజీనామాలు ఆమోదించాలని అధికారులపై ఒత్తిడి తెస్తామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ జబివుల్లా మాట్లాడుతూ పార్టీకోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమను టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి పట్టించుకోలేదన్నారు. ఏకపక్ష ధోరణితో పార్టీ పరువు తీస్తున్నారని తెలిపారు. తమ వార్డుల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎలాంటి సమాచారం అందించలేదన్నారు. పార్టీకి వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ టీడీపీని బలహీన పరుస్తున్నాడని తెలిపారు.ఇలాంటి నాయకుడితో పార్టీకి నష్టం ఉందని అధిష్టానం గుర్తించాలన్నారు. వరదను టీడీపీ నుంచి తప్పించి పార్టీని కాపాడాలన్నారు. వారి వెంట టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చట్టప్రకారం నడుచుకుంటాం 22 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డికి అందజేశారు. రాజీనామాలు తీసుకున్న అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఏపీ మున్సిపల్ యాక్ట్ 1965 ప్రకారం ఒక కౌన్సిలర్ రాజీనామా చేస్తే సెక్షన్ 55 ప్రకారం ఏం చేయాలో తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. రాజీనామా లేఖలో ఏముందంటే.. కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు సమర్పించిన రాజీనామా లేఖల్లో ఒకే సారాంశం ఉంది. ఈ నెల 29న టీడీపీ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి 23, 24, 25, 26 వార్డుల్లో నగరదర్శిని పేరుతో మున్సిపల్, రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి వార్డు కౌన్సిలర్లను అవమానించినందుకు, ఇతర వార్డుల్లో కూడా వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇన్చార్జి ఏకపక్షంగా, నియంతృత్వంగా కార్యక్రమాలను చేస్తున్నందుకు నిరసనగా కౌన్సిలర్ పదవికి రాజీ నామా చేస్తున్నాను. నా రాజీనామాను ఆమోదించవలసినదిగా కోరుచున్నాను. అని రాసి ఉంది. మున్సిపల్ కార్యాలయం సమీపంలో భారీ బందోబస్తు టీడీపీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నారన్న సమాచారం రావడంతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ రోడ్డులోని హెడ్‌పోస్టాఫీసు సమీపంలోని బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న జనాలను పంపించారు. కౌన్సిలర్లు, నాయకులు జనంతో కలిసి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అంగీకరించలేదు. శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. కౌన్సిలర్లను మాత్రమే అనుమతించాల్సి ఉందని, అయినా ముఖ్య నాయకులను కూడా అనుమతిస్తున్నామని చెప్పారు. లేదంటే నాయకులు కూడా బయటనే ఉండాల్సి వస్తుందని డీఎస్పీ చెప్పారు. దీంతో వారి వెంట వచ్చిన ప్రజలందరూ మున్సిపల్ కార్యాలయం బయటనే ఉండాల్సి వచ్చింది. -
గండీడులో మూకుమ్మడి రాజీనామాలు
మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలమూరు జిల్లా గండీడు మండలంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. గండీడు మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలని కోరుతూ శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గండీడు మండలాన్ని వెంటనే వికారాబాద్ జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వినతి పత్రం సమర్పించారు.