సాక్షి, కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడలేదని, గుర్తు తెలియని అంగతకులు వెనుక నుంచి నెట్టడం వల్ల ఆమె తల, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు ఎస్‌కేఎం ప్రభుత్వ ఆస్పత్రి డైరెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రం 7.30 గంటలసమయంలో మమతా బెనర్జీ కాళీగట్‌లో తన నివాసంలో కింద పడ్డారు. అయితే సిబ్బంది అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలోని వుడ్‌బర్న్ వార్డ్‌లో చేర్చారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు దీదీ నుదిటిపై 3కుట్లు, ముక్కుపై ఒక కుట్టు వేశారు. మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సిఫార్సు మేరకు సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ చేయించారు. రాత్రి 9:45 గంటలకు, ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్లారు.
ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ సీఎం ఇంట్లో పడిపోవడం వల్లే గాయమైందని అందరూ అనుకున్నారు. కానీ మమతా బెనర్జీ తీవ్ర గాయాలు పాలు కావడం వెనుక కోట్ర దాగినట్లు సమాచారం. ఎస్‌ఎస్‌కేఎం డైరెక్టర్ మణిమోయ్ బంద్యోపాధ్యాయ ఈ సంఘటనకు గల కారణాల్ని వెల్లడించారు. సీఎం తనకు తానుగా పడిపోవడం వల్ల జరిగే గాయాలకంటే.. ఆమె వెనుక నుంచి ఎవరో బలవంతంగా నెట్టడం వల్లే నుదిటికి, ముక్కుకి గాయాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ ప్రమాదానికి గల కారణాల్ని నిర్ధారించలేదు.
ఈ సందర్భంగా ఈసీజీ, సిటిస్కాన్ చేసినట్లు చెప్పిన ఆయన.. వైద్యుల పర్యవేక్షణ కోసం ఆస్పత్రిలో ఉండాలని సూచించామని, కానీ ఆమె ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడినట్లు తెలిపారు. ఇక శుక్రవారం వరకు ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.
మరోవైపు మమత కోడలు, తృణమూల్ కౌన్సిలర్ కజారీ బెనర్జీ దీదీకి గాయాలు కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీదీ పడిపోయింది అని విన్నాను. ఎవరో నెడితేనే తీవ్రగాయాయ్యాయని అన్నారు.
కాగా, గురువారం సాయంత్రం, దివంగత తృణమూల్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆమె కాళీఘాట్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న దక్షిణ కోల్‌కతాలోని గరియాహట్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆమె కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment