పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్, సీపీఐలు రెండు కళ్లులాంటివని సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.
మాల్దా జిల్లా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోందని సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ పోరాటం చేస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
‘బెంగాల్‌లో కాంగ్రెస్‌తో మాకు పొత్తు లేదు. ఇక్కడ సీపీఎం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. రెండూ బీజేపీతో చేతులు కలిపినట్లు, మీరు (ఓటర్లు) కాంగ్రెస్ లేదా సీపీఐ(ఎం)కి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తగ్గించుకోవడం, మోదీకి సహాయం చేయడం ఆ రెండు పార్టీల లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్, సీపీఐలు రెండు కళ్లులాంటివని’ దీదీ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్, సీపీఐ నాయకులు బీజేపీ స్వరంతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలనను నడుపుతున్న టీఎంసీ విధానాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.
దేశంలో ప్రతిపక్షాల కూటమి బలంగా ఉంది. దానికి ఇండియా కూటమి అని పేరు పెట్టింది నేనే. కానీ బెంగాల్‌లో కూటమి ఉనికిలో లేదు. దాని రాష్ట్ర నాయకులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీదీ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment