
సాక్షి,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధార్ అనుసంధానాన్ని మరోసారి తప్పుపట్టారు. ఆధార్ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ లింకేజ్ సమస్యాత్మకం..ఆధార్ కార్డు పేరుతో 210 ప్రభుత్వ వెబ్‌సైట్లలో వివరాలు ఉంచుతున్నారు..ఇది వ్యకిగత స్వేచ్ఛకు, సమాజానికి, దేశానికి పెను ముపు’ అని దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు తప్పులు చేస్తూ కూడా సంతోషంగా ఉన్నారని కేంద్ర పెద్దలకు చురకలు వేశారు.
ఆధార్‌పై గతంలోనూ మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.తన మొబైల్ కనెక్షన్ కట్ చేసినా తాను మాత్రం ఆధార్‌ను మొబైల్ పోన్‌కు లింక్ చేయనని మమతా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment