కోల్‌కతా: రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం మరళీదర్ సేన్ రోడ్ ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని విశాలమైన ప్రాంతానికి తరలిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా కేంద్రం నుంచి ఢిల్లీలోని ప్రధాన కార్యలయానికి అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడే విధంగా పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు దిలీప్ ప్రకటించారు. ప్రస్తుతం పార్టీని 36 శాఖలను విభజించామని, గ్రామీణ, బ్లాక్‌లేవల్‌లో కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా నిర్మిస్తున్నామని తెలిపారు.
వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో విశాలమైన, అధునాతన భవనాలు ఉన్నాయని, తాము ఇంకా జిల్లా స్థాయిలో కూడా కార్యాలయాలు నిర్మించుకోలేదన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీకి అందుబాటులో ఉండే నేతలకు కొత్త వాహనాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి శుభాష్ సర్కార్ ప్రకటించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని, తృణమూల్‌కి ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment