విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న బీజేపీ కార్యకర్త మృతదేహం
కోల్‌కతా : బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్త రాజకీయ హత్య సంచలనం రేపుతోంది. పురులియా జిల్లాలోని దాభా గ్రామంలో శనివారం దులాల్ అనే వ్యక్తి విద్యుత్ స్తంభానికి ఉరి వేసి వేలాడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో త్రిలోంచల్ అనే బీజేపీ కార్యకర్త చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించిన సంగతి తెలిసిందే. కాగా, దులాల్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, దీని వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేతల హస్తం ఉందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
టీఎంసీ నేతలే ఇరువురు కార్యకర్తలను హతమార్చి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై వెంటనే సీబీఐపై దర్యాప్తుకు ఆదేశించాలని స్థానిక బీజేపీ నేత రాహుల్ సిన్హా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యకర్తల మృతిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని షా మండిపడ్డారు.
కాగా, బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఖండించారు. బీజేపీ కార్యకర్తల మరణాలతో తృణమూల్‌కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల విచారణలో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. వరుస అనుమానాస్పద మృతి సంఘటనలపై వెంటనే దర్యాప్తు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ)ను ఆదేశించారు.
వరుస ఘటనలపై దర్యాప్తును ప్రారంభించిన ఎస్పీ జాయ్ బిశ్వాస్.. మొదటి ఘటనపై హత్య అనుమానాలు(వ్యక్తిగత కక్ష కారణంతో హత్య) ఉన్నాయని, రెండో ఘటన ఆత్మహత్యలా ఉందని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం విచారణను ముమ్మరం చేస్తామని వెల్లడించారు.
Distressed to know about yet another killing of BJP karyakarta Dulal Kumar in Balrampur, West Bengal. This continued brutality and violence in the land of West Bengal is shameful and inhuman. Mamata Banerjee’s govt has completely failed to maintain law and order in the state. pic.twitter.com/jrA1prcs91
— Amit Shah (@AmitShah) June 2, 2018
Comments
Please login to add a commentAdd a comment