
కోలకతా: దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఢీకొట్టి నిలిచే ధైర్యం ఎవరికైనా ఉందంటే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జినే అని చెప్పాలి. ప్రత్యర్థులపై తనదైన మాటల దాడితో విరుచుకుపడటంలో మమతకు మరెవరు సాటిలేరనే సంగతి తెలిసిందే. రాజకీయాల పరంగా ఎంత సూటిగా, ఘాటుగా వ్యవహరిస్తారో అలానే సంప్రదాయాల పరంగానూ అదే తీరు కనుబరుస్తారని నిరూపించారు దీదీ. తాజాగా మమత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక మామిడి పండ్లను బహుమతిగా పంపారు.
2011లో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా హిమసాగర్, మాల్డా, లక్ష్మణ్‌భోగ్ వంటి ప్రత్యేక రకాల మామిడి పండ్లను మోదీకి పంపారు. కాగా ఈ వరుసలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఆమె పశ్చిమ బెంగాల్ మామిడి పండ్లను బహుమతిగా పంపారు.
చదవండి: అమ్మపార్టీలో.. చిన్నమ్మ భయం
Comments
Please login to add a commentAdd a comment