
మన గ్రామాల్లో ఇప్పటికీ సోది చెప్పేవారు వస్తుంటారు. వీరు సాధారణంగా గిరిజనులై ఉంటారు. సినీమాలో సోదిని సాధారణంగా మారు వేషంలో హీరో హీరోయిన్‌కీ, హీరోయిన్‌కి హీరో మనిషి సోది చెప్పి ఇద్దరూ కలిసేటట్టు చేస్తారు. ఏమైనా ఈ ‘సోది’లో చిన్న నాటకం పాలు ఎక్కు వుంది. మనం సినీమా ‘సోది’ మనిషితో సాధారణంగా ఏకీభవి స్తాం. ఒకప్పుడు ఏకీభవించకపోనూ వచ్చు. ఇప్పుడు నాకు అలాంటి సోది చెప్పాలని మనసు పుట్టింది.
మన దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పోటీ చేస్తే బీజేపీని ‘సోది’లోకి లేకుండా ఓడించగలవు. సందే హం లేదు. కానీ సమస్య అల్లా ఎలా అన్నదే. ఈ దేశంలో ఎవరూ ఎవరితోనూ ఏకీభవించరు. దాదాపు మెజారిటీ వచ్చిన బీజేపీని అటకెక్కించిన కర్ణాటకలో పదవీ స్వీకారం చేసిన రెండు వారాలకు ఒకానొకరకమైన మంత్రిమండలి ఏర్పడింది. మళ్లీ ఎందుకైనా మంచి దని కాంగ్రెస్ తన వాటా కోటాలో నాలుగైదు మంత్రి పదవుల స్థానాలను ఖాళీగా ఉంచింది. అలాగే కుమారస్వామి కూడా కనీసం మూడు స్థానాలను ఖాళీ ఉంచారు. ఇప్పుడు ఎం.బి. పాటిల్ వంటి వారు ఎదురు తిరిగితే వారికి ఇవ్వ డానికి స్థానాలు రెడీగా ఉన్నాయి. ఇది కలిసి పనిచేసే రెండు దక్షిణాది ప్రతిపక్షాల నీతి.
నేను మాయావతి పెద్దరికాన్ని అంగీకరించి అవసరమైతే– బీజేపీని ఓడించటానికి తలవొంచుతాను– అని అఖిలేష్ యాదవ్ ఇవాళ వాక్రుచ్చారు. మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో చెయ్యి కలపరు. అలా కలపడం ఇష్టంలేని మరో సీఎం కేసీఆర్ ముందురోజే వచ్చి కుమారస్వామిని పలకరించి వెళ్లారు. అలాంటి మరొక వ్యక్తి ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్. సరే. తమ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా కోసం మన బాబు ఎవరితోనైనా చేతులు కలపగలరు. ఇక కమ్యూనిస్టు పార్టీకీ, కాంగ్రెస్‌కీ చుక్కెదురు. అయితే బీజేపీకి ‘పెద్ద’ చుక్క ఎదురు. కనుక– ప్రతిపక్షాల సమీకరణలో వారు కలుస్తారా? ఇది ప్రశ్న.
కానీ ఈ పార్టీలన్నీ ఈ దిక్కుమాలిన బీజేపీని కలిసికట్టుగా ఓడించాలి. ఎలా? నాది ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఎవరికీ ఏమీ ఇబ్బంది లేకుండా ఈ దేశం అంతటిలో 380 పార్లమెంటు సభ్యులను ఎంపిక చెయ్యండి. మరి ఇంతమంది మన పార్లమెం టులో పడతారా? ఎవడు చూడొచ్చాడు? ఆయా ప్రాంతాలకు వినియోగపడేటట్టు–కనీసం–15 పద వులు వేరుగా ఉంచండి. ఎవరైనా గట్టిగా ఎదురుతిరి గితే– కార్యార్థం మంత్రి పదవి ఖాళీగా ఉంటుంది. మరి మమతాబెనర్జీ, కేరళ సీఎం పినరయి విజ యన్ మాట వింటారా? అలాగే బాబు కేసీఆర్ ఆజ్ఞని పాటిస్తారా? కనుక– ఇక్కడే నా ‘ఆసు’ ఉంది. ఈ ఏర్పాటులో ప్రతీ ప్రాంతానికీ ఒక ప్రధానమంత్రి ఉండాలి. తమరు గమనించారో లేదో– ఇప్పుడు పద వులు పొందిన కర్ణాటక మంత్రులకు ఐదేళ్ల ‘పదవి’ లేదు. అలాగే ప్రాంతీయ ప్రధానమంత్రులకు కూడా పూర్తి ఐదేళ్లు ఇవ్వనక్కరలేదని నా ఉద్దేశం. ఉదా హరణకి దక్షిణాదికి ఎడపాడి పళనిస్వామి, పన్నీరుసెల్వం ఉంటారు. రెండో భాగంలో కేసీఆర్ రావచ్చు. అలాగే– తూర్పుకి శర ద్‌పవార్, పశ్చిమానికి మమతా బెనర్జీ, ఉత్తరానికి–నాకు రెండు పేర్లున్నాయి. షేక్ అబ్దుల్లా, కేజ్రీవాల్.
ఇంక తగాదాలు వచ్చే ప్రసక్తి లేదు. ఏ ప్రాంతపు ప్రధాని, ఆ ప్రాంతపు సమ స్యలను పరిష్కరిస్తారు. అవసరమైతే పద వులు మార్చడానికి బోలెడన్ని పదవులు న్నాయి. మాయావతి ఏనుగుల పార్కుల్ని నిర్మించి– దళితులకు సేవ చేస్తారు. బాబు నదులన్నీ ఏకం చేసే పనిమీద ఉంటారు. అందరు పార్లమెంటు మెంబ ర్లకూ రోజూ దిక్కుమాలిన పార్లమెంటుకి వెళ్లాల్సిన అవసరం లేదు. కేకలువేసి, అల్లరి చేసి, స్పీకర్ మీద చిత్తు కాగితాలు విసిరే వారికే ప్రాధాన్యం ఇస్తారు. దేశంలో ఏ గొడవా లేకుండా, బీజేపీ సోదిలోకి కనిపించకుండా– సామరస్యంగా పాలన జరుగు తుంది. వీళ్లందరూ ఎవరితోనూ ప్రమేయం పెట్టుకో కుండా– చక్కగా తమ ప్రాంతంలో ‘ప్రధాని’ పద విని నిర్వహించుకోవచ్చు. అసలు ఎందుకిలా అయింది? ఈ నాయకులు మొన్న మొన్నటిదాకా ప్రజలతో ‘మన’ అంటూ మాట్లాడి ప్రస్తుతం ‘తన’కి సెటిల్ అయ్యారని రాజకీయాలు చెప్తున్నాయి.
ఈ దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై– పాలక వర్గాన్ని ఓడించటంలో ‘చమత్కారం’ ఈ దేశంలో ఇద్దరికే తెలుసని నా ఉద్దేశం–మోదీ, అమిత్ షా. ఇది నా సోది.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment