
గాంధీనగర్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. వారంతా మోదీ వ్యతిరేకులు కాదనీ, దేశానికి, ప్రజల అభివృద్ధికి వ్యతిరేక శక్తులని విమర్శించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే తమపై ఆరోపణలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. గుజరాత్‌లోని సిల్వసాలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
ప్రజల సొమ్మును దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి తనపై కోపం రావడం సహజమేనని ఎద్దేవా చేశారు. మహాకూటమి నేతల్లో ఒకరినొకరు కలిసి మాట్లాడుకోలేని నాయకులు అప్పుడే వాటాలను పంచుకోవడం మొదలుపెట్టారని మోదీ ఆరోపించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మోదీ సిల్వసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment