bamb blast
-
దర్భంగ పేలుడు: హైదరాబాదే.. ఎందుకు?
సాక్షి, సిటీబ్యూరో: దర్భంగ ఎక్స్‌ప్రెస్ దహనానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు స్థానికంగా లభించే పదార్థాలతోనే ‘బాంబు’ తయారు చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నిర్ధారించింది. హబీబ్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లోని దుకాణాల నుంచి ఖరీదు చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించే దాన్ని తయారు చేసినట్లు తేల్చారు. వాస్తవానికి ఇది బాంబు కాదని మండుతూ చుట్టూ మంటలు వ్యాపించేలా డిజైన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన నాసిర్ మాలిక్ దాదాపు 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ సమీపంలో ఉన్న ఓ ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్నాడు. ఇక్కడి యువతినే వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఇతడి సోదరుడైన ఇమ్రాన్ మాలిక్ తమ స్వస్థలంలోనే ఉండేవాడు. ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖానా అలియాజ్ హఫీజ్ ఇక్బాల్ అలియాస్ మాలిక్ భాయ్ 1993 నుంచి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడు. ఇతడిపై సీబీఐ, ఢిల్లీ పోలీసు సహా అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. అక్కడ ఉంటూనే ఐఎస్ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ ద్వారా ఇమ్రాన్‌ను ఉగ్రవాదం వైపు ఆకర్షించాడు. యూట్యూబ్‌లో లింకులు షేర్.. స్థానికంగా దొరికే పదార్థాలతో వివిధ రకాల పేలుళ్లు సృష్టించడం ఎలా? అగ్ని ప్రమాదాలు జరిగేలా చేయడం ఎలా? తదితర అంశాలపై ఆన్లైన్లో శిక్షణ ఇస్తూ యూట్యూబ్‌లో ఉన్న కొన్ని వీడియోల లింకులూ షేర్ చేశాడు. దర్భంగ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేయాలనే కుట్రతో దాదాపు 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ వద్ద ఆశ్రయం పొందాడు. చిక్కడపల్లి, హబీబ్ నగర్ల్లోని వివిధ దుకాణాల నుంచి సేకరించిన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు వంటివి తయారు చేశాడు. పాక్ నుంచి సూచనలు.. ఇంట్లోనే ఇమ్రాన్, నాసిర్‌లు రెండు మూడింటిని తయారు చేసి మండించి చూశారు. దీనికి సంబంధించిన సూచనల్ని పాక్ నుంచి ఇక్బాల్ ఖానా ఇస్తూనే ఉన్నాడు. ఇంట్లో ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలుసుకున్న ఇక్బాల్ ఓ టానిక్ సీసాలో ఈ మూడింటినీ నేర్పుగా ఏర్పాటు చేయించాడు. పేపర్, ఇంజెక్షన్ సిరంజ్‌లతో చేసిన ఏర్పాటు కారణంగా గరిష్టంగా 16 గంటల్లో ఈ మూడు కలిసి మంటలు చెలరేగేటా ప్లాన్ చేశారు. అయితే ఇమ్రాన్, నాసిర్‌లు 50 మిల్లీ లీటర్ల పరిమాణంలో తయారు చేసిన దాన్ని పక్కాగా రూపొందించలేకపోయారు. ఫలితంగా ఆ సీసాలో ఉన్న రసాయనాలు బయటకు కారడంతో పాటు దర్భంగ రైల్వేస్టేషన్లో ఆ పార్శిల్ దింపిన కూలీ కింద పడేస్తే కానీ మంటలు అంటుకోలేదు. సికింద్రాబాద్‌లో పార్శిల్ ఆఫీస్‌లో ఈ అన్నదమ్ములు మహ్మద్ సూఫియాన్ పేరుతో ఇచ్చిన పాన్ కార్డు కాపీ సైతం ఇక్బాల్ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడని ఎన్ఐఏ గుర్తించింది. ఈ కేసులో ఇమ్రాన్‌ను ప్రధాన నిందితుడిగా(ఏ1), నాసిర్‌ను రెండో నిందితుడిగా(ఏ2) చేర్చిన ఎన్ఐఏ వీరితో సంప్రదింపులు జరిపిన ఖైరాన వాసులు హాజీ సలీం, మహ్మద్ ఖాఫిల్‌ను మిగిలిన నిందితులుగా చేర్చాలని నిర్ణయించింది. ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల అరెస్టు బిహార్ రాష్ట్రం దర్బంగ రైల్వే స్టేషన్లో జరిగిన పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ముందడుగు వేసింది. ఘటనకు కారణమైన ఇద్దరు లష్కర్–ఎ–తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేసింది. యూపీలోని శాలినీ జిల్లాకు చెందిన ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్‌ఖాన్, నజీర్ ఖాన్ అలియాస్ నజీర్ మాలిక్ ప్రస్తుతం నాంపల్లిలో నివసిస్తున్నారు. ఈ నెల17న దర్బాంగా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబరు 1లోని ఓ పార్సిల్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ముజఫర్ నగర్ జిల్లా, దర్బంగా రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పార్సిల్ సికింద్రాబాద్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఉగ్రకోణాలు బయటపడటంతో కేసును ఈ నెల 24న ఎన్ఐఏకి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ లష్కర్–ఎ–తోయిబా దేశవ్యాప్తంగా పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిందని గుర్తించింది. పాకిస్తాన్ హండ్లర్ల ఆదేశాల మేరకు నజీర్ అతని సోదరుడు ఇమ్రాన్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ఈ పేలుడుకు ప్లాన్ చేశారని నిర్ధారించారు. దుబాయ్ ఎందుకు వెళ్లారో..? ఈ నలుగురూ కలిసి 2016లో దుబాయ్ వెళ్లారని గుర్తించిన దర్యాప్తు అధికారులు అది ఎందుకన్నది ఆరా తీస్తున్నారు. ఇమ్రాన్, నాసిర్‌లను ఎన్ఐఏ అధికారులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్‌పై బీహార్‌లోని పాట్నా ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చేందుకు వారిని ఇక్కడి నుంచి తరలించారు. ఇక్బాల్ ఖానా సైతం ఖైరానలో ఉండగా వస్త్ర వ్యాపారం చేసే వారు. ఇలానే ఇతడికి ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాదే.. ఎందుకు? ఒకవేళ వీరు భారీ విధ్వంసానికి పాల్పడే క్రమంలో దీన్ని ఒక ట్రయల్‌గా ఈ పేలుడుకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ ఎన్ఐఏ ఆరా తీస్తోంది. పాకిస్తాన్ నుంచి పక్కాగా ఆదేశాలు అందాయి. నిందితులిద్దరూ ఇందుకోసం ఎన్క్రిప్టెడ్ సౌకర్యం ఉన్న అనేక రకాల సామాజిక మాధ్యమాలను వినియోగించారు. మొత్తానికి టెర్రర్ మాడ్యుల్‌ను పక్కాగా అమలు చేశారు. అయితే హైదరాబాద్‌లో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉన్నందున ఎలాంటి నేరం జరిగినా నిందితులు కేవలం 24 గంటల్లో దొరికిపోతారు. ఈ విషయం నేరస్తులకు తెలుసు. అలాంటిది చిన్నపాటి పేలుడుకు కుట్ర పన్నినా.. పోలీసులు వెదుక్కుంటూ వస్తారన్న విషయం మాత్రం విస్మరిస్తారా? లేక వీరు మరేదైనా ప్లాన్ అమలు చేసే క్రమంలో దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చేందుకు ఈ పేలుడుకు పాల్పడ్డారా? అన్న కోణంలో ఎన్ఐఏ ఆరా తీస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్‌కు పని చెప్పమంటావా..? -
వరుస పేలుళ్లతో వణికిన బాగ్దాద్
బాగ్దాద్: రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో గురువారం ఇరాక్ రాజధాని బాగ్దాద్ వణికి పోయింది. సెంట్రల్ బాగ్దాద్‌లోని నిత్యం రద్దీగా ఉండే ‘బాబ్ అల్ షార్కి’లో జరిగిన ఈ రెండు వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది. ఈ పేలుళ్లకు ఇంతవరకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. కానీ, అధికారులు మాత్రం ఇది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర సంస్థ పనేనని ధ్రువీకరించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో రాజకీయంగా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తి మొదట, మార్కెట్ మధ్య నిల్చుని తనకు ఆరోగ్యం బాలేదంటూ గట్టిగా అరిచాడని, దాంతో అందరూ ఆయన చుట్టూ మూగారని, అదే సమయంలో ఆ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ తహసిన్ అల్ ఖఫాజీ వివరించారు. ఆ తరువాత కాసేపటికే మరో వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్ చేసిన దారుణమిదని అన్నారు. -
పెషావర్‌లో పేలుడు: ఏడుగురు దుర్మరణం
పెషావర్ : పాకిస్తాన్‌లోని పెషావర్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ దారుణ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు పోల్పోయారు. ఒక శిక్షణా స్కూల్లో మంగళవారం శక్తివంతమైన పేలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. పెషావర్ శివార్లలోని ఇస్లామిక్ సెమినరీ ద్వారా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించిందని అధికారుల తెలిపారు. జామియా జుబైరియా మదర్సా ప్రధాన హాలులో ఇస్లాం బోధనా ఉపన్యాసం ఇస్తుండగా ఈ బాంబు దాడి జరిగిందని పోలీసు అధికారి వకార్ అజీమ్ వెల్లడించారు. మదర్సా వద్ద ఎవరో ఒక బ్యాగ్ వదిలిపెట్టిన కొద్ది నిమిషాల తరువాత బాంబు పేలిందన్నారు. ఆత్మాహుతి దాడి కాదనిపోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాగా క్వెట్టాలో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించిన రెండు రోజుల తరువాత జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
సంచలన తీర్పు: నలుగురికి మరణశిక్ష
న్యూఢిల్లీ: జైపూర్ 2008 వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ.. తీర్పును వెలువరించింది. దోషులు సైఫర్ రెహ్మాన్, సర్వర్ అజ్మి, మహ్మద్ సైఫ్, సల్మాన్‌లకు శిక్షను ఖరారు చేస్తూ రాజస్తాన్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కాగా జైపూర్ బాంబు పేలుళ్లల కేసులో పదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం.. నలుగురు నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. -
బెంగాల్లో నాటు బాంబు పేలుడు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. నార్త్ 24 పరగణ జిల్లాలోని కంకినారలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎండీ ముక్తర్(68) తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉన్నసమయంలో గుర్తు తెలియని దుండగులు అతని నివాసం ముందు నాటు బాంబును పేల్చారు. ఈ ఘటనలో పేలడంతో ముక్తర్‌తో పాటు మరొకరి ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్యతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాంబు దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కంకినారలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు బాగా తీరుగుతారని, దోపిడీ కోసమే ఇలాంటి ఘటనలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడ్డవారికి సహాయం అందించవల్సిందగా స్థానిక అధికారులును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా బాండు పేలుడు ఘటనలో రాజకీయ వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. -
కోలుకోని లంక
ఈస్టర్ పర్వదినం రోజున నెత్తురోడిన శ్రీలంక వారం రోజులు గడిచినా ఇంకా తెరిపిన పడలేదని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి. శనివారం ఒక పట్టణంలో సోదాలు జరుపుతుండగా భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతోపాటు ఆత్మాహుతి దాడికి పాల్పడటం, మరో 15మంది మరణించడం చూస్తే ఆ దేశంలో ఉగ్రవాదం ఎంత లోతుగా వేళ్లూనుకున్నదో అర్ధమవుతుంది. సుదీర్ఘకాలం విధ్వంసాలు, ఊచకోతలు చవిచూసిన దేశంలో భద్రతా బలగాల, నిఘా సంస్థల కన్నుగప్పి ఉగ్రవాద సంస్థలు భారీయెత్తున బాంబులు, మారణాయుధాలు పోగేసు కోవడం... స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ఊహకందనిది. వరసగా 26 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా లంకలో సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమిళ టైగర్లు సాగించిన ఆత్మాహుతి దాడులు, కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని సాగించిన మారణకాండ ఆ దేశాన్ని ఊపిరాడనీయకుండా చేశాయి. అదంతా పదేళ్లక్రితం మాట. ఆ దాడులకు కారణమైన తమిళ టైగర్ల సంస్థ ఎల్టీటీఈ అక్కడే పుట్టి పెరిగి విస్తరించింది. సింహళ జాతీయతను రెచ్చగొట్టి, మైనారిటీలుగా ఉన్న తమిళ సంతతి ప్రజలపై వివక్ష అమలు చేయడంతో రేగిన అసంతృప్తి క్రమేపీ ఉద్యమ రూపం ధరించి స్వయంపాలన అడిగేవరకూ వెళ్లింది. తమిళ ఉద్యమ సంస్థలు లేవనెత్తిన అంశాలను చక్కదిద్దేం దుకు శ్రీలంకలోని ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ పెట్టని కారణంగా అది సాయుధ పోరాటాన్ని విశ్వసించే ఎల్టీటీఈ తదితర సంస్థల ఆవిర్భావానికి దోహదపడింది. కానీ ఇప్పుడు ఉగ్రవాద ఉదంతాల మూలాలు వేరు. మతపరమైన విశ్వాసాలు కాస్తా విద్వేషంగా రూపుదిద్దుకోవడం, ఆ విద్వేషం అంతిమంగా ఉన్మత్త స్థితికి చేరడం తాజా దాడుల్లో కనబడుతుంది. లంక దాడులకు పాల్పడిన ముఠాలకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొందరు తోడ్పాటును అందించారని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. పేలుళ్ల సూత్రధారి కోయంబత్తూర్ వచ్చివెళ్లారని ఆ కథనాలు అంటున్నాయి. ఈ విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దాడులు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి నగరంలో ఒక మసీదుపై దాడిచేసి 50మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతానికి ప్రతీకారమనడం ఒక సాకు మాత్రమే. కొన్నేళ్లుగా విధ్వంసానికి పథక రచన చేయకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. న్యూజిలాండ్ దాడికి, శ్రీలంక దాడులకు మధ్య నిండా నెలరోజుల వ్యత్యాసం కూడా లేదు. ఇంత తక్కువ వ్యవధిలో అవసరమైన మను షుల్ని పోగేసుకొని వారికి ఉన్మాదాన్ని నూరిపోయడం, బాంబులు, ఇతర మారణాయుధాలు అవ సరమైనచోట్లకు తరలించడం వీలుకాదు. శ్రీలంకకు భారీయెత్తున పర్యాటకులు వస్తుండటం, అందులో పాశ్చాత్య దేశాలకు చెందినవారు గణనీయంగా ఉండటం, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, నిఘా సంస్థలు ఏమరుపాటుగా ఉండటం వంటివన్నీ క్షుణ్ణంగా గమనించిన తర్వాతే ఉగ్రవాదులు ఆ దేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారని, దాడులకు అదును కోసం ఎదురుచూశారని మొత్తం ఘటనల క్రమం చూస్తే అర్ధమవుతుంది. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు రద్దు చేయడం, భద్రతా బలగాల కదలికలు తగ్గడం వగైరాలను ఉగ్రవాదులు కొన్నేళ్లుగా గమనించబట్టే ఈ స్థాయిలో హింసకు పాల్పడ్డారు. ఇది శ్రీలంకకు మాత్రమే కాదు... అన్ని దేశాలకూ గుణపాఠమే. వేరే ఎక్కడో దాడులు జరిగాయి గానీ అటువంటివి ఇక్కడ సాధ్యం కాదని అనుకోవడానికి వీల్లేదని లంకకు ఎదు రైన చేదు అనుభవాలు చెబుతున్నాయి. లంకలో ఎంత ఘర్షణాత్మక వాతావరణమున్నా ముస్లింలు, క్రైస్తవుల మధ్య ఎప్పుడూ పొరపొచ్చాలు రాలేదు. వాస్తవానికి దాడులకు సూత్రధారిగా భావిస్తున్న ఎన్టీజే చీఫ్ జహ్రన్ హషీమ్ విద్వేష ప్రసంగాలతో అందరినీ రెచ్చగొడుతున్నాడని నాలుగేళ్లక్రితం ఒకసారి, ఏడాదిక్రితం మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని శ్రీలంక ముస్లిం మండలి ఉపాధ్యక్షుడు హిల్మే అహ్మద్ చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. నిర్లిప్తత ఈ స్థాయిలో పెరిగాక ఉగ్రవాదులు దాడులకు దిగడంలో వింతేముంది? ఉగ్రవాదులు తక్షణ లక్ష్యాలు ఆశించి పనిచేయరు. వారిది దీర్ఘకాలిక ప్రణాళిక. తమ దాడుల పర్యవసానాలు మరణాలతో, విధ్వంసంతో ఆగిపోవడం కాదు వారికి కావలసింది. అవి సమా జంలో శాశ్వతంగా విద్వేషాగ్నులు రగల్చాలి. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాలి. మను షులు పరస్పరం కలిసిమెలిసి ఉండే వాతావరణాన్ని ధ్వంసం చేయాలి. ఒకరిపై ఒకరికి అనుమా నాలు కలిగించాలి. ఈ పన్నాగాలను సరిగా అర్ధం చేసుకోలేకపోతే ఉగ్రవాదాన్ని అంతం చేయడం అంత సులభం కాదు. లంక దాడుల తర్వాత కొలంబో ఆర్చిబిషప్ మాల్కమ్ రంజిత్ ఈ విషయం లోనే అప్రమత్తంగా ఉండాలని అందరినీ హెచ్చరించారు. ఈ చర్యల ద్వారా తాము నమ్ముతున్నా మని చెప్పే మతాన్ని ఉగ్రవాదులు ఎలా చిత్రీకరించదల్చుకున్నారో, దానిపై ఎలాంటి అభిప్రా యాన్ని కలగజేయాలనుకున్నారో అందరూ గ్రహించాలని ఆయన కోరారు. సమాజంలో అందరూ వృధా ఘర్షణలకు దిగాలన్నదే వారి ఆంతర్యమని హెచ్చరించారు. అందరం సమష్టిగా వ్యవహ రించి ఉగ్రవాదుల ఆటల్ని సాగనీయకుండా చూద్దామని పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తూ లంకలో కొన్నిచోట్ల ముస్లింలపై కొందరు అకారణంగా దాడులకు దిగారు. శరణార్థులను తరిమి కొట్టారు. ఇటువంటివి పరోక్షంగా ఉగ్రవాదులకే తోడ్పడతాయి. క్రైస్ట్ చర్చి దాడి అనంతరం ‘మనం ఉన్మాదానికి బలైనవారి పేర్లు తల్చుకుందాం. వారిని బలితీసుకున్న ఉన్మాది పేరు ఉచ్చరించొద్దు. ఆ ఉన్మాదికి పేరుతో సహా ఏమీ మిగలకుండా చేద్దామ’ని న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ అన్న మాటలు గమనించదగ్గవి. ఉగ్రవాదం ఒక మతానికో, ప్రాంతానికో చెందినది కాదు. దానికి నిర్దిష్టమైన రూపం ఉండదు. సమాజం మొత్తం ఏకమై అవిశ్రాంతంగా పోరాడితే తప్ప అది సుల భంగా అంతరించదు. లంక దాడుల నుంచి గ్రహించాల్సింది ఇదే. -
గాయాల్ని రేపుతున్న దాడులు
ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో జరిగిన దాడులు.. సుదీర్ఘ కాలంపాటు సాగి, పదేళ్ల క్రితం మేలో ముగిసిన అంతర్యుద్ధం జ్ఞాపకాలను మేల్కొలిపాయి. ఈ దాడుల ప్రభావం అంతర్జాతీ యంగా కంటే స్థానిక మతపరమైన అంశాలపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు తోడు, తాజాగా మరింత హింస చెలరేగే అవకాశం ఉంది. 1948 తర్వాత కొత్తగా ఏర్పడిన స్వతంత్ర శ్రీలంక.. సింహళ బౌద్ధ జాతీయ దేశంగా అవతరిం చింది. దీంతో మొత్తం ద్వీప మంతా సింహళ తేర వాద బౌద్ధంకు కీలక స్థానంగా మారింది. సింహళ ప్రాబల్యాన్ని అంగీకరించిన మైనారిటీలకు మాత్రమే అక్కడ జీవించే హక్కు ఉంది. దాన్ని వ్యతిరేకించే వారిపై దాడులు తప్పవు. రాజ్యాంగంలో కూడా ఇదే వివక్ష కొనసా గింది. సింహళేతరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే గుర్తించారు. రాజ్యం పెంచిపోషిస్తున్న ఈ సింహళ బౌద్ధ స్వభావం దాని వ్యవస్థల్లోకి కూడా పాకింది. భద్రతకు సంబంధించిన విభాగాల్లో ముఖ్యంగా సైన్యంలో పైర్యాంకుల్లో ఉండేవారంతా వారే. అలాగే తమిళ చొరబాటుదార్లను ఏరివేయ డానికి ఏర్పాటు చేసిన విభాగానికి ప్రఖ్యాత సింహళ రాజు పేరిట విజయబహు ఇన్ ఫాంట్రీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. స్వతంత్రత, సమాన హక్కులు కావాలంటూ 1950 నుంచి 1970 వరకు సాగిన తమిళుల శాంతి యుత డిమాండ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోప డంతో ద్వీపంలోని ఈశాన్యంలో తమకు స్వతంత్ర మాతృభూమి కావాలని తమిళులు, హిందూ తమి ళులు, క్రైస్తవులు, ముస్లింలు డిమాండ్ చేసేవరకు వెళ్లింది. దిగువ స్థాయిలో సాగుతున్న యుద్ధం 1983 నాటికి మరింత రాజుకుంది. బ్లాక్ జులై కార్య క్రమాల్లో భాగంగా సింహళ వర్గీయులు తమకు ప్రాబల్యం ఉన్న దక్షిణాదిలో వేలాదిమంది తమి ళులను హతమార్చారు. శ్రీలంక సైన్యం సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని వేలాదిమందిని హతమార్చింది. ఈ నేప థ్యంలో ఏర్పడిన ఎల్టీటీఈకి విస్తృతమైన మద్దతు లభించింది. ఆ సంస్థ ఆత్మాహుతి దళాలను ఏర్పా టుచేసి దక్షిణాదిలో తన ప్రాభవాన్ని చాటుకుంది. ఇదే సందర్భంలో తమిళులు, తమిళం మాట్లాడే ముస్లింల మధ్య ఎవరు అసలైన తమిళులనే విష యమై వైషమ్యాలు చెలరేగి అటు ఎల్టీటీఈ, ఇటు సైన్యం చేతిలో ఇరువర్గాలు ఊచకోతకు గుర య్యాయి. 1990లో ఉత్తర ప్రావిన్స్ నుంచి సుమారు లక్షమంది ముస్లింలను బహిష్కరించ డంతో వీరి మధ్య విభజన రేఖ మరింత పెరిగింది. యుద్ధ సందర్భంలో తమిళ పౌరులకు ఆశ్రయ మిచ్చాయనే నెపంతో శ్రీలంక సైన్యం అనేక చర్చిలు, దేవాలయాలపై తరచూ బాంబు దాడులకు పాల్ప డింది. ఆ దాడులన్నీ మతపరమైనవిగా గాక ప్రభుత్వ అంగీకారం ఉన్నట్టే భావించాలి. మూడు దశాబ్దాల తర్వాత ఎల్టీటీఈ ప్రత్యా మ్నాయ ప్రభుత్వం నడుపుతున్న తరుణంలో శ్రీలంక సైన్యం దాన్ని నెత్తుటి ఏరుల్లో ముంచెత్తి అణచివేసింది. ఈక్రమంలో సుమారు 40వేల మంది చనిపోయినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించగా, అంతకు ఇంకో లక్ష మంది చనిపోయారని కొందరు సామాజిక కార్య కర్తలు చెబుతారు. యుద్ధం జరుగుతున్నప్పుడు, తర్వాత తమి ళులు అదృశ్యం కావడంపై సైన్యం సమాధానం చెప్పాలని వందలాదిమంది తమిళుల కుటుంబ సభ్యులు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకపోతే శ్రీలంకలో హింస మరింత పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి అధికా రులు కూడా హెచ్చరించారు. 2009 నుంచి సింహళ బౌద్ధ జాతీయులంతా మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవులపై దృష్టిసారిం చారు. తమిళులందరినీ భద్రతా దళాలు తమ ఉక్కు పిడి కిలిలో బంధించగా, సింహళ బౌద్ధ మూకలన్నీ ముస్లింలు, క్రైస్తవులపై తరచూ దాడులకు పాల్ప డ్డాయి. 2018లో ముస్లిం వ్యతిరేక దాడులతోపాటు క్రైస్తవులపై డజన్ల కొద్దీ దాడులు జరి గాయి. గతంలో తమిళులపై జరిగిన హింసాత్మక అణచివేతను చూసిన ముస్లింలు, క్రైస్తవులు సింహళ జాతీయుల దాడులకు చాలా సంయమనం వహించారు. ఏది ఏమైనప్పటికీ, ఈస్టర్ పండుగ రోజు జరిగిన దాడులు గతంలో సింహళీలు జరిపిన హింసా కాండకు ప్రతీకారంగా జరిగినవి కావు. దాడులకు పాల్పడినవారు సింహళ బౌద్ధులను లక్ష్యంగా చేసు కోలేదు. కేవలం క్రైస్తవ సంస్థలు, పర్యాటక సంస్థ లపైనే దాడి చేశారు. తమిళుల సాయుధ పోరాటానికి క్రైస్తవులంతా మద్దతు ప్రకటించారు. ఇప్పటికే హింసను ఎదు ర్కొంటున్న క్రైస్తవులపై మళ్లీ దాడి చేయడం సరి కాదు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో మసీదుపై ఒక క్రిస్టియన్ దాడిచేసి ముస్లింలను హతమార్చినందుకే తాము ఇప్పుడు క్రైస్తవులపై దాడి చేశామని ఐసిస్ ప్రకటించిన నేపథ్యంలో తాజా పరిస్థితులు ఎటు వంటి ఉద్రిక్తతలకు దారితీస్తాయో, ఏ కొత్త హింస చెలరేగడానికి కారణమవుతాయో చెప్పలేం. మారియో అరుళ్తాస్ (ఆల్జజీరా సౌజన్యంతో...) -
సినిమాను తలపించేలా ప్లాన్ చేశారు..
-
పశ్చిమ బెంగాల్లో డమ్‌డమ్‌లో పేలుడు కలకలం
-
కోల్‌కత్తాలో భారీ పేలుడు
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో గాంధీ జయంతి నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. డమ్‌డమ్ సమీపంలోని నగర్‌బజార్‌లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం భారీ శబ్ధంతో బాంబు పేలగానే దానిలోంచి గాజు పెంకులు, ఇనుప చువ్వలు దూసుకుని వచ్చాయని స్థానికులు చెపుతున్నారు. మార్కెట్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో దుండగులు పేలుడు పదార్ధాలు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగినే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాండ్ డిస్పోజల్ స్వాడ్ తనికీ నిర్వహించారు. ఘటనలో గాయపడ్డ వారిని దగ్గరలోని జీకే కౌర్ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డమ్ డమ్ మున్సిపాలిటీ చైర్మన్ పంచూ రాయ్ పార్టీ కార్యాలయం సమీపంలో ఈ పేళుల్లు సంభవించాయి. దీంతో అధికార తృణమూల్ దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. తమను రాజకీయంగా ఎదుర్కొలేకనే గాంధీ జయంతి నాడు రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించాలిన బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని టీఎంసీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసిందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు లండన్ లాంటి నగరం అవసరంలేదని.. బెంగాల్లోనే భద్రత కల్పిస్తే చాలని సీపీఎం నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
సోమాలియాలో ఉగ్ర బీభత్సం
-
సోమాలియాలో ఉగ్ర బీభత్సం
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం రాత్రి(భారత కాలమానం)అత్యంత శక్తిమంతమైన బాంబు పేలడంతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 275 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్రికా కొమ్ముగా పేరుపడ్డ సోమాలియాలో ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మొగదిషులో రద్దీగా ఉన్న మార్కెట్‌ను కుదిపేసిన ఈ పేలుడులో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పేలుడు తీవ్రతకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అనేక మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. పలువురు క్షతగాత్రుల శరీర భాగాలు తెగిపడగా వారిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇంతవరకూ ప్రభుత్వం తరఫున అధికారికంగా మృతుల సంఖ్యను ప్రకటించలేదు. ఈ దాడిని జాతీయ విపత్తుగా పేర్కొన్న సోమాలియా ప్రభుత్వం ఇది అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ పనేనని ఆరోపించింది. సోమాలియా అధ్యక్షుడు మొహమద్ అబ్దుల్లాహీ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు.ఒక పక్క రక్తమోడుతున్నా తమవారి కోసం పలువురు భవనాల శిథిలాల కింద వెదకడం ప్రమాదస్థలం వద్ద భీతావహ పరిస్థితికి అద్దం పట్టింది. ప్రమాదం జరిగినప్పటి నుంచీ నగరం అంబులెన్స్‌ల సైరన్లతో మార్మోగింది. ‘మా పదేళ్ల అనుభవంలో ఇలాంటి భయంకర దాడిని చూడలేదు’ అని ఆమిన్ అంబులెన్స్ సర్వీస్ ట్వీట్ చేసింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు పేలుడు తీవ్రతకు సోమాలియా విదేశాంగ కార్యాలయం సమీపంలో ఉన్న సఫారీ హోటల్ కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఆదివారం తెల్లవారుజాము వరకూ ఫ్లాష్ లైట్ల వెలుగులో తీవ్రంగా శ్రమించారు. ప్రజలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఆస్పత్రులు ఇచ్చిన పిలుపుకు వేలాదిమంది స్పందించారు. ‘ఒక పక్క మృతదేహాలు, మరొపక్క క్షతగాత్రులతో ఆస్పత్రి మొత్తం నిండిపోయింది. శరీర భాగాలు తెగిపడ్డ వారిని కొన ప్రాణాలతో ఆస్పత్రి తీసుకొస్తున్నారు’ అని స్థానిక ఆస్పత్రి డైరెక్టర్ మొహమద్ యూసుఫ్ చెప్పారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాధారణ పౌరుల్ని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని సోమాలియా సమాచార శాఖ మంత్రి అబ్దిరహమాన్ ఒమర్ పేర్కొన్నారు. ‘ఈ రోజు దుర్దినం. వారెంతో క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించారు. ఉగ్రవాదులపై పోరుకు మనమంతా ఏకం కావాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. -
టీడీపీ కార్యకర్త ఇంట్లో పేలిన బాంబులు
గుంటూరు: గుంటూరు జిల్లా నరసారావు పేట మండలంలో పమిడిపాడులో శుక్రవారం కలకలం రేగింది. గ్రామానికి చెందిన టీడపీ కార్యకర్త ఎద్దు వెంకటేశ్వర్లు ఇంట్లో ఈ రోజు ఉదయం బాంబులు పేలాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబులు పేలుడు కు సంబందించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.