
న్యూఢిల్లీ: జైపూర్ 2008 వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ.. తీర్పును వెలువరించింది. దోషులు సైఫర్ రెహ్మాన్, సర్వర్ అజ్మి, మహ్మద్ సైఫ్, సల్మాన్‌లకు శిక్షను ఖరారు చేస్తూ రాజస్తాన్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కాగా జైపూర్ బాంబు పేలుళ్లల కేసులో పదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం.. నలుగురు నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.