
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని ప్రజలందరికీ తెలుసని, హామీల అమలు కోసం బంద్ చేస్తే అరెస్టులు చేశారని వైఎస్‌ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘టీడీపీ ఎంపీలు రాజకీయ డ్రామాలు మొదలుపెట్టారు. కేంద్రంపై ఒత్తిడి చేయకుండా నాటకాలుఆడుతున్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు.
ఓటుకు కోట్లు కేసుకు భయపడి మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాష్ట్ర భవిష్యత్‌ను పణంగా పెట్టారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదు?. టీడీపీ నేతల అవినీతి పరాకాష్టకు చేరింది. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు ఏమయ్యాయి. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment