ఢిల్లీ: ప్రజలకు న్యాయం జరగకుంటే పార్లమెంట్ సమావేశాలను కొనసాగనివ్వమని టీడీపీ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆ ప్రాంత ఎంపీలు సోమవారం మీడియాతో మాట్లాడారు. సభ నుంచి సస్పెండ్ చేసినా తమ పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. సీమాంధ్ర ప్రజలను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని వారు విమర్శించారు. ఏ కమిటీ నిర్ణయాలు పరిగణనలోకి తీసుకుని విభజనకు మొగ్గుచూపారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం స్వార్థపూరితమని ఎంపీలు మండిపడ్డారు.