‘సస్పెండ్ చేసినా పోరాటాన్ని కొనసాగిస్తాం’ | we will fight back on bifurcation: seemandhra tdp mp's | Sakshi
Sakshi News home page

‘సస్పెండ్ చేసినా పోరాటాన్ని కొనసాగిస్తాం’

Published Mon, Aug 19 2013 5:49 PM | Last Updated on Sat, Aug 11 2018 4:30 PM

we will fight back on bifurcation: seemandhra tdp mp's

ఢిల్లీ: ప్రజలకు న్యాయం జరగకుంటే పార్లమెంట్ సమావేశాలను కొనసాగనివ్వమని టీడీపీ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆ ప్రాంత ఎంపీలు సోమవారం మీడియాతో మాట్లాడారు. సభ నుంచి సస్పెండ్ చేసినా తమ పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. సీమాంధ్ర ప్రజలను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

 

సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని వారు విమర్శించారు. ఏ కమిటీ నిర్ణయాలు పరిగణనలోకి తీసుకుని విభజనకు మొగ్గుచూపారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం స్వార్థపూరితమని ఎంపీలు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement