
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని ఇంటి వద్ద టీడీపీ ఎంపీలు ధర్నాకు యత్నించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు చేసినట్లుగా చంద్రబాబు నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడిస్తే ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీల తీరు సిగ్గుచేటని.. ఇప్పటికైనా దొంగ నాటకాలను కట్టిపెట్టాలని హితవు పలికారు.