
సాక్షి, ఢిల్లీ: టీడీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోందని తెలిపారు.
కాగా, జీవీఎల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అన్ని గడపలు తొక్కుతోంది. టీడీపీ తప్పుడు మాటలు చెబుతోంది. కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ-జనసేన పొత్తుపై టీడీపీకి అక్కసు ఎందుకు?. పవన్ కల్యాణ్ మాతోనే కలిసి ఉన్నాడు. రాష్ట్రంలో టీడీపీ అబద్దపు ప్రచారం చేస్తోంది అని సీరియస్ అయ్యారు.