GVL Narsimha Rao
-
‘బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అన్ని గడపలు తొక్కుతోంది’
సాక్షి, ఢిల్లీ: టీడీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోందని తెలిపారు. కాగా, జీవీఎల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అన్ని గడపలు తొక్కుతోంది. టీడీపీ తప్పుడు మాటలు చెబుతోంది. కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ-జనసేన పొత్తుపై టీడీపీకి అక్కసు ఎందుకు?. పవన్ కల్యాణ్ మాతోనే కలిసి ఉన్నాడు. రాష్ట్రంలో టీడీపీ అబద్దపు ప్రచారం చేస్తోంది అని సీరియస్ అయ్యారు. -
కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సీరియస్ అయ్యారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఆంధ్ర ద్రోహి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, జీవీఎల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ కొనుగోలుకు అధికారులను పంపిస్తామని ఆంధ్రా ద్రోహి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఏపీని కేసీఆర్ ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఉన్న మాట వాస్తవమే. ఈ అంశంపై కేంద్ర మంత్రులకు లేఖలు రాశాం. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కేసీఆరే. ఆయన రాజకీయ అవసరాల కోసం ఏపీ ఉద్ధరిస్తాననడం సిగ్గుచేటు. ఏపీలో డ్రామాలకు తెరతీస్తే తగిన బుద్ధి చెబుతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఐటీ పాలసీతో కంపెనీల ఏర్పాటు సులభతరం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ పాలసీతో కంపెనీల స్థాపన మరింత సులభతరం కానుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏర్పాట్లు తదితర అంశాలపై పల్సస్ గ్రూప్ లిమిటెడ్ సీఈవో గేదెల శ్రీనుబాబు నేతృత్వంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాది కాలంలో విశాఖకి పలు ఐటీ దిగ్గజ కంపెనీలు రానున్నాయని చెప్పారు. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపె నీలకు తెలియజేసే ఉద్దేశంతోనే జనవరి నుంచి ఏప్రిల్ వరకు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులతో పాటు గ్లోబల్ టెక్ సదస్సును విశాఖలో నిర్వహిస్తున్నామని వివరించారు. జనవరి 6,7,8 తేదీల్లో విశాఖలో హెల్త్ సమ్మిట్ జరగబోతుందని, అదే నెల 20, 21 తేదీల్లో ఇన్ఫినిటీ ఐటీ సదస్సు జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జీ 20 సదస్సు, మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు విశాఖలోనే నిర్వహిస్తున్నామని తెలి పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు, గ్లోబల్ టెక్ సమ్మిట్ ద్వారా పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకటి, రెండు నెలల్లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, అమెజాన్ త్వరలోనే విశాఖలో అడుగుపెట్టబోతుందని, హెచ్‌సీఎల్ విశాఖ, తిరుపతి, కాకినాడ, గుంటూరులో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిందని గుర్తుచేశారు. ఐటీ రంగానికి చెందిన యాంకర్ యూనిట్లు విశాఖకు వస్తే, ఐటీ హబ్‌గా పేరొందిన పలు నగరాల సరసన విశాఖ కూడా నిలుస్తుందన్నారు. విశాఖలో వాతావరణం కూడా ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర పది రంగాలకు చెందిన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి విశాఖలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తామన్నారు. త్వరలో ఎంఎస్ఎంఈలతోపాటు ఐటీ ఇన్సెంటివ్‌లను కూడా విడుదల చేస్తామని చెప్పారు. గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ గ్లోబల్ టెక్ సమ్మిట్‌కు 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందన్నారు. ఈ సమ్మిట్‌కు సంబంధించి ఇప్పటికే భువనేశ్వర్, ఢిల్లీ, హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహించామని చెప్పారు. జీ 20 దేశాలలో కూడా ఈ సదస్సు ప్రాధాన్యత వివరించి ఐటీ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించనున్నామని తెలిపారు. జీవీఎల్‌కు విభజన హామీల మీద చర్చించే ధైర్యం ఉందా.. రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చించే ధైర్యం బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకు ఉందా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఇ వ్వాల్సిన ప్రాజెక్ట్‌లు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని దా నికి జీవీఎల్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జీవీ ఎల్‌ను నాయకుడిగా బీజేపీ వాళ్లే గుర్తించడం లేదన్నారు. 2024 నాటికి జీవీఎల్ ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు. -
విశాఖకు మరిన్ని ఐటీ సంస్థలు: జీవీఎల్ నరసింహారావు
సాక్షి, విశాఖపట్నం: ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని వనరులు విశాఖపట్నంలో ఉన్నాయని బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. దేశంలోనే టాప్ ఐటీ డెస్టినేషన్ సిటీగా విశాఖ నిలవనుందన్నారు. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు విశాఖకు వచ్చాయని, మరికొన్ని రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఊరూ, పేరు లేని ఐటీ కంపెనీలకు సబ్సిడీలిచ్చి ప్రభుత్వ సొమ్మును దురి్వనియోగం చేశారని మండిపడ్డారు. అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘విశాఖ అభివృద్ధి’ అజెండాతో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.రవీంద్ర పాల్గొన్నారు. -
టీడీపీ నేతలు ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదు: జీవీఎల్
-
బియ్యం పంపిణీపై జీవీఎల్ వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హితవు పలికారు. బియ్యం పంపిణీపై జీవీఎల్ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు.. ఏపీలో పూర్తిగా నూకల్లేని సన్న బియ్యం (సార్టేక్స్) బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నాన్ సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేస్తే సరిపోదని అన్నారు. అంతేగాక కేంద్రం సార్టెక్స్ బియ్యం ఇవ్వకపోగా నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తీరు వల్లే ఉచిత బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. ఈ విషయంపై నీతి ఆయోగ్‌కు లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. తాము 1.46 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం ఇస్తుంటే ఏపీలో సగం జనాభాకే ( 86 లక్షల మందికి) ఇస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర మాత్రం అధికంగా ఇస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రధానికి కూడా సీఎం జగన్మోహన్రెడ్డి మే 16న లేఖ రాశారని గుర్తు చేశారు. ‘రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే ఆ బియ్యాన్ని తెచ్చే ఏర్పాటు చేయండి. కేంద్రంలో మీరే ఉన్నారు కాబట్టి మాకు రావాల్సింది ఇప్పించండి. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీరు ఇప్పుడైనా రావాల్సిన బియ్యం కోసం లేఖ రాయండి. ప్రజలకు మీరిచ్చే అర్థ బంతి బోజనాలు మేము పెట్టలేము. నీతి ఆయోగ్ సిఫార్సులను వెంటనే అమలయ్యేలా మీరు కృషి చేయండి. మేము సిద్దంగా ఉన్నాం...మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. సీఎం దావోస్ పర్యటనలో ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు.’ అని తెలిపారు. చదవండి: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు: మంత్రి అంబటి -
‘బీజేపీ బుల్డోజర్’ అంటే కేటీఆర్‌కు భయం: జీవీఎల్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగరవేస్తుందన్న భయంతోపాటు బీజేపీ బుల్డోజర్ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే తెలంగాణ మంత్రి కె.తారక రామారావు ప్రధాని మోదీపై హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కేంద్రం విస్తృతంగా సహాయం చేస్తున్నప్పటికీ విమర్శిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ ఇటీవల బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని, దీనిని బట్టే బీజేపీ అంటే టీఆర్ఎస్కు ఉన్న భయమేంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ కేంద్రంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాసినా, ప్రసారం చేసినా ఉపేక్షించేది లేదని పలు పత్రికలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీపై తప్పుడు ప్రచారం, విమర్శలు చేస్తే చట్టబద్ధంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 రెట్లు ఎక్కువగా తెలంగాణకు నిధులు ఇస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందని, ఆ పార్టీల పాలన దూరం చేసేలా 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని ఖరారు చేశారన్నారు. ‘ఏపీలో కేంద్ర వాటాకింద నిధులు ఇస్తున్నా, ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్సీపీ స్టిక్కర్లు పెడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉపయోగిస్తే, కేంద్రం వాటా ఉందని చెప్పాలని, తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. సబ్సిడీ బియ్యం పథకానికి మీ ఫొటోలు ఎలా పెడతారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి’అని జీవీఎల్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రమంత్రులు పర్యటించి, కేంద్ర పథకాలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే అంశాలకే నిధులు ఇవ్వాలని కోరతానని చెప్పారు. -
బీజేపీ నేత జీవీఎల్ కు వెల్లంపల్లి సవాల్
-
హోదాపై ప్రత్యేక కమిటీ వేయండి: జీవీఎల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించడానికి, ఆచరణాత్మక మార్గాలను పరిశీలించడానికి.. దానిని సిఫార్సు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు లేఖ రాశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఈ లేఖ ప్రతులను మీడియాకు అందజేశారు. లేఖలో ప్రత్యేక హోదా అన్న పదాన్ని జీవీఎల్ ప్రస్తావించలేదు. తెలంగాణతో పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై 17న జరిగే సబ్ కమిటీ సమావేశం అజెండా నుంచి హోదా సహా నాలుగు అంశాలను సవరించడాన్ని ఆయన అందులో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి నాలుగు అంశాలను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో కారణాలు వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆ లేఖలో జీవీఎల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర స్థాయిలో చర్చ జరిగితే తమకూ సంతోషమేనని తెలిపారు. బాబు ప్రతిపాదనతోనే ప్యాకేజీ హోదానైనా ఇవ్వండి లేదా అంతకు సరిపడా ప్యాకేజీ ఇవ్వండి అని అప్పట్లో చంద్రబాబు ప్రతిపాదన చేసేనే కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందని జీవీఎల్ చెప్పారు. -
కేంద్రం నుంచి తగ్గుతున్న పన్ను ఆదాయం
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడమే కాకుండా పలు విభాగాలకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తొలి ఏడాది నుంచి ఆర్థిక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి తోడు 2019–20లో ఆర్థిక మందగమనంతో రాష్ట్రానికి రావాల్సిన సొంత పన్ను ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఆ తరువాత రెండేళ్ల నుంచి కోవిడ్ మహమ్మారి కారణంగా ఇటు రాష్ట్ర పన్ను ఆదాయం.. అటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇటీవల రాజ్యసభలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నది. గత మూడేళ్లగా కేంద్ర పన్నుల వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్నులు ఎలా తగ్గిపోయాయో పంకజ్ చౌదరి వివరించారు. 2018–19తో పోల్చి చూస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.4,545 కోట్లు తగ్గిపోయింది. 2019–20 ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2020–21 ఆర్థిక ఏడాదిలో రూ.3,781 కోట్లు తగ్గిపోయింది. ఇక ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జనవరి వరకు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రాష్ట్రానికి కేవలం రూ.22,072 కోట్లే వచ్చాయి. అలాగే విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం కూడా గత రెండు ఆర్థిక ఏడాదుల నుంచి తగ్గిపోయినట్లు పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానంలో స్పష్టమైంది. అలాగే గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి రాష్ట్రం నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి వసూలైన రాబడి కూడా తగ్గిపోయినట్లు మంత్రి పంకజ్ చౌదరి వివరించారు. -
ఉదయం దీక్ష.. మధ్యాహ్నం ఫైట్!
సాక్షి, అమరావతి/ఉయ్యూరు (పెనమలూరు)/గుడివాడ/ఉంగుటూరు (గన్నవరం): ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలు మంగళవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఎంపీ సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రాజు, విష్ణువర్దన్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకొచ్చిందని సోము వీర్రాజు ఆరోపించారు. కాగా, దీక్షను మధ్యాహ్నానికి విరమించి, బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామంటూ సోము నేతృత్వంలో పార్టీ నేతలు గుడివాడకు బయలుదేరి వెళ్లారు. నందమూరు అడ్డరోడ్డు వద్ద హైడ్రామా గుడివాడలో సంక్రాంతి సంబరాలను టీడీపీ వివాదాస్పదంగా మార్చింది. దీనికి వంతపాడుతూ గుడివాడ పర్యటనకు బయలుదేరిన బీజేపీ నాయకులను నందమూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి, సీఎం రమేష్ సహా 35 మంది బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఘర్షణకు దిగారు. వీర్రాజుతో పాటు 18 మందిని ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. వీర్రాజు మాట్లాడుతూ.. తాము చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకున్నా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఎందుకు అడ్డుకున్నారు? బీజేపీ ఎంపీ జీవీఎల్ సాక్షి, న్యూఢిల్లీ: సంక్రాంతి కార్యక్రమాల ముగింపు వేడుకలకు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం గుడివాడ వెళ్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారని, అరెస్ట్ చేసి బయటకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసుల ప్రవర్తన చూస్తే ఎంత అరాచకంగా వ్యవహరించారో తెలిసిపోతుందన్నారు. ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలంటే వైఎస్సార్సీపీ నేతలకు చేదా అని అడిగారు. -
భవిష్యత్‌లో పోటీ చేస్తారా? లేదా? అనే మీమాంసతో టీడీపీ శ్రేణులున్నాయి
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విధానపరమైన నిర్ణయం: జీవీఎల్
-
గెజిట్ నోటిఫికేషన్ ను అందరూ స్వాగతించాలి : జీవీఎల్
-
కేంద్రం గెజిట్ నోట్ విడుదల చేయడం శుభపరిణామం
-
బీజేపీలో వర్గపోరు కలకలం
సాక్షి, విజయనగరం: జిల్లా బీజేపీలో వర్గపోరు కలకలం రేపింది. పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర కోశాధికారిగా ఉంటూ పాకలపాటి సన్యాసిరాజు పార్టీ ఫండ్ పేరిట అవినీతి పాల్పడ్డారంటూ పావని రెడ్డి వర్గం ఫిర్యాదు చేసింది. తనపై ఫిర్యాదు చేశారన్న కారణంతో సన్యాసిరాజు పదవికి రాజీనామ చేశాడు. దీంతో అప్పటినుంచి పావని రెడ్డి, సన్యాసి రాజు మధ్య వర్గపోరు మొదలైంది. జిల్లాలో వీరిద్దరి వర్గ పోరుతో బీజేపీ ద్వితీయ శ్రేణి కేడర్ నిరుత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్ నరసింహారావు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. -
హైకోర్టు తరలింపుపై స్పందించిన కేంద్రం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్లో ఓ ప్రకటన చేశారు. హైకోర్టు తరలింపు అంశంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామనిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని, హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు.న్యాయస్థానం తరలింపు కోసం ఎలాంటి గడువూ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారా అన్న జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇదివరేక సంకల్పించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో పవన్ కల్యాణ్ ఎదురుచూపులు..
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కూడా బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ అగ్రనాయకులతో భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది కీలక నేతలతో సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. అయితే సాయంత్రం వరకు ఎటువంటి భేటీ జరగలేదు. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ అగ్రనాయకులను అడిగేందుకే ఢిల్లీకి పవన్ వచ్చారని ప్రచారం జరుగుతోంది. (చదవండి: బీజేపీ ముందు పవన్ కీలక ప్రతిపాదన!) తిరుపతిలో బీజేపీనే పోటీ చేస్తుంది: జీవీఎల్ ఇక త్వరలో జరగబోయే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో మేమే పోటీ చేస్తాం.. జనసేనకు ఇవ్వమని తెలిపారు. -
బాబు అక్రమాల కేసు గిన్నిస్ రికార్డు లెవల్లో..
-
గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాజ్యాంగానికి లోబడే గవర్నర్ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్ గవర్నర్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదన్న విషయాన్ని తాము పార్లమెంటులోనే చెప్పామని గుర్తుచేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలన్నదే బీజేపీ వైఖరిని పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయానికి కేంద్రంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) ‘అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా గవర్నర్ వ్యవస్థపై మాట్లాడే పార్టీలు ఉన్నాయి. స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని రాజధానిగా టీడీపీ ఎంచుకుంది. చంద్రబాబు అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగం తనకు అనుకూలంగా పనిచేయాలనుకోవడం చంద్రబాబుకు సరికాదు. నాడు రాజధానిపై చర్చ సందర్భంగా అమరావతి తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టాడమని కేంద్రం చెప్పింది. కేంద్రంపై టీడీపీ ఇకనైనా దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా బాబు మూర్ఖంగా వ్యవహరించారు. ఫెడరల్ స్ఫూర్తితో పని చేస్తున్నాం.’ అని జీవీఎల్ పేర్కొన్నారు. -
స్థానిక పోరు : జనసేన-బీజేపీ ఉమ్మడి పోటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు విజయవాడ వేదికగా సమావేశమయ్యారు అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేనా కలిసి పోటీచేయాలని నిర్ణయించినట్లు భేటీ అనంతరం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. బీజేపీ బలంగా ఉన్న స్థానాలు మీద చర్చించామని, సరైన అభ్యర్థులను బరిలో నిలపుతామని తెలిపారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై జనసేన నాయకులతో చర్చలు జరుపుతామన్నారు. ఇరు పార్టీల సమన్వయంతో అభ్యర్థులను నిర్ణయిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ పోరులోనూ జనసేన, బీజేపీ ఉమ్మడిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాయని తెలిపారు. కాగా బీజేపీ-జనసేన మధ్య ఢిల్లీ వేదికగా ఇటీవల పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. కాగా అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికలపై విజయవాడలో బీజేపీ-జనసేన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీట్లు సర్దుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టోపై ప్రధాన చర్చ జరిగినట్లు సమచారం. ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి జీ. సతీష్, కేంద్ర మాజీమంత్రి పురంధరేశ్వరి, సోము వీర్రాజు, మాధవ్, కామినేని పాల్గొన్నారు. జనసేన నుండి నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. -
‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకే అమరావతిపై తను ప్రకటన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ సైతం వేసవి రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ సీఎం ప్రకటనతో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్డీఏ చట్టం ద్వారా రైతుల భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెట్టవద్దని హితవు పలికారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని పనులను కేంద్ర ప్రభుత్వం చేయదని చెప్పారు. పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్ సూచించారని తెలిపారు. ఒక చానల్ తనపై తప్పుడు వార్తలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ కట్టుకథలు అల్లితే సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అమరావతిపై జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తను మాట్లాడుతున్నట్టు చెప్పారు. -
‘జీవీఎల్‌పై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణం’
సాక్షి, అమరావతి : రాజధానిపై వివరణ ఇచ్చినందుకుగాను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై జోక్యం చేసుకోమని కేంద్రం వెల్లడించినా.. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోందని విమర్శించారు. ‘రాజధానిపై కేంద్ర జోక్యం చేసుకోదని పార్లమెంట్లో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. పచ్చ మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌పై దుష్ర్పచారానికి ఒడిగట్టడం దారుణం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. లోకేశ్ తర్వాత ఆయనే చక్రం తిప్పారు ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు గత ఐదేళ్లలో అక్రమ పద్దతిలో రూ.వేలకోట్ల ఆస్తులను పోగేసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త. బాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు. అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : వామ్మో.. ఏబీవీ!: సర్వత్రా విస్మయం) -
మండలి రద్దు: కేంద్రం అడ్డు చెప్పే ఛాన్సే లేదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. (మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం) -
బీజేపీ, జనసేన కీలక భేటీ : విలీనమా? పొత్తా?
సాక్షి, విజయవాడ : బీజేపీతో జనసేన పార్టీ పొత్తా? విలీనమా? అనేది నేడు తేలనుంది. దీనిపై చర్చించేందుకు ఇరుపార్టీల ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున ఇన్చార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన తరపున సమావేశంలో పాల్గొన్న వారిలో పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు. మూడు రోజుల క్రితం హస్తినాలో మకాంవేసిన పవన్.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆతర్వాత బీజేపీ, జనసేన పొత్తుపై ప్రతిపాదనలు వచ్చింది. దీంతో జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవడమా లేదా పొత్తు కుదుర్చుకోవడమా అనే అంశంపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. అయితే దీనిపై బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుతో రహస్య పొత్తు కుదుర్చుకున్న పవన్‌తో కలిసి ఎలా పనిచేద్దామని కొంతమంద నేతలు ప్రశ్నింస్తుండగా, ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని మరికొంత మంది కొంతమంది ప్రతిపాదించినట్లు సమాచారం. జనసేనతో భేటీకి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. జనసేన అధినేత పవన్‌తో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వచ్చే నాలుగేళ్లలో జనసేనతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చంచామని బీజేపీ సినియర్ నేత జీవీఎల్ అన్నారు. కేవలం అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలే తమ ఎజెండా కాదని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణ ఉంటుందన్నారు. 2024 ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జీవీఎల్ పేర్కొన్నారు. -
ఎల్లోమీడియా ప్రచారాన్ని ఖండించిన బీజేపీ
-
చంద్రబాబుకు జైలు భయం!
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం జైలుకు వెళ్లడం చూసి ప్రతిపక్ష చంద్రబాబుకు భయం పట్టుకొని ఉండొచ్చని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అవినీతిపరులను వదిలి పెట్టేది లేదని ఇటీవల ప్రధాని మోదీ హెచ్చరించగానే ఆ భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతుండొచ్చని చెప్పారు. టీడీపీతో తమకు పొత్తన్నదే ఉండదని అయితే ఆ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటే మాత్రం జాతీయ నాయకత్వంతో మాట్లాడడానికి తాను సిద్ధమని ప్రకటించారు. గతంలో పొత్తు పెటుకున్నప్పుడు టీడీపీ లాభపడింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారే కానీ బీజేపీకి నామమాత్రం ప్రయోజనం కూడా కలగలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని చెప్పారు. శనివారం విజయవాడలో ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో జీవీఎల్ మాట్లాడుతూ పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు టీడీపీ దగ్గర ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వరకు మోదీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు పొత్తు గురించి మాట్లాడడం టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేదని భయపడడం వల్లేనని చెప్పారు. అసాధ్యాలను చేసి చూపించాం.. ‘తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారం చేపట్టడమన్నది ఇప్పడు అసాధ్యంగా కనిపించే అంశమే. కానీ దేశ రాజకీయాల్లో అసాధ్యం అనుకున్నవి మోదీ నాయకత్వంలో అనేకం సాధించి చూపించాం. ఇక్కడా మా అంతట మేం అధికారంలోకి ఎలా రావాలన్న దానిపై దృష్టి పెట్టి కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లోనే గెలుస్తామన్న నమ్మకం ఉంది’ అని జీవీఎల్ చెప్పారు.ఇతర పార్టీల నుంచి ఎవరో వస్తేనే రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని తాము భావించడం లేదన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంపై రాష్ట్ర ప్రజల్లో నమ్మకం కలిగించడం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుందని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశంపై బీజేపీ నాయకత్వంతో తాను మాట్లాడతానని ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని జీవీఎల్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి... ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయం మంచిదే కానీ అందుకనుగుణంగా ఆదాయం పెంచుకోవడంపైనా దృష్టి పెడితే బాగుంటుందని జీవీఎల్ సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమైతే అందులో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశమే లేదన్నారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుందన్నారు. అయితే రాజకీయ కారణాలతో రాజధాని మార్పు మంచిది కాదన్నారు. గత సర్కారు హయాంలో అవినీతి జరిగిందని నిపుణుల కమిటీలు తేల్చాక కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలేవీ తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. ఏ మొహంతో పొత్తు కోసం ప్రయత్నాలు?: కన్నా తమతో పొత్తు కోసం టీడీపీ ఏ మొహం పెట్టుకొని వెంపర్లాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాజకీయ విలువలు లేని టీడీపీతో బీజేపీ ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని ట్విట్టర్లో పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలతో యూటర్న్లు తీసుకుంటూ విలువలను టీడీపీ దిగజార్చిందన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు టీడీపీకి శాశ్వతంగా ఎప్పుడో తలుపులు మూసి వేశారని చెప్పారు. -
ఐదేళ్లూ చంద్రబాబు రాజధానిలో గ్రాఫిక్స్ చూపించారు
-
కోడెల ధైర్యవంతుడు.. అలాంటి నేత..
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు చాలా ధైర్యవంతుడని, అలాంటి నేత ఆత్మహత్యకు పాల్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మృతిపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు. రాజధాని, హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్‌దే నిర్ణయమని, కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. గతంలో రాయలసీమలోని ఒక్కోజిల్లాకు కేంద్రం రూ.50కోట్లు ఇచ్చిందన్నారు. ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కేంద్ర నిధులకు లెక్కచెప్పమంటే చంద్రబాబు స్పందించలేదన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ సినిమా చూపించారంటూ ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. -
ఏపీ రాజధానిపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : చంద్రబాబు ప్రభుత్వం అమరావతి భవ్యంగా నిర్మించామని చెప్పుకోవడంలో అర్థం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. స్విస్, సింగపూర్ చాలెంజ్ పేరుతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో కొద్దిగా ఖర్చుపెట్టి మిగతా మొత్తం జేబులో వేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై జీవీఎల్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..కేంద్ర ప్రభుత్వం సూచనలతో చేసేది కాదని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రెండు వేల కోట్ల రూపాయలతో కేవలం తాత్కాలిక భవనాలకే రాజధానిని పరిమితం చేసిందని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి 5 వేల ఎకరాలు సరిపోతాయని.. అయితే అవసరానికి మించి అమరావతిలో భూమిని సేకరించారని ఆరోపించారు. చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చుచేసి ప్రజాధనాన్ని లూటీ చేశారని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రస్తుతం అమరావతి తరలిపోతుంది అంటూ కొంతమంది లేనిపోని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనం లూటీకి సంబంధించి ప్రభుత్వం వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం సూచనలతో చేసేది కాదు. అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అమరావతిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వం చెప్పాలి. భవనాల నిర్మాణం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. కంపెనీలకు వ్యక్తులకు చౌక ధరకు పెద్ద ఎత్తున రైతుల భూములను కట్టబెట్టారు. అంతేకాదు గత ప్రభుత్వం హయాంలోనే పోలవరంలో అవినీతి జరిగింది. 5800 కోట్ల హెడ్ వర్క్స్ పనులను మూడు కంపెనీలకు ఇచ్చారు. ఇందులో భాగంగా 2346 కోట్ల రూపాయలు హెడ్ వర్క్స్ పనుల్లో అధికంగా చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. ఎవరు చెబితే అధిక చెల్లింపులు చేశారో బయటికి చెప్పాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లు అందరికీ ముందుగానే చెల్లింపులను పూర్తి చేశారు. గత ప్రభుత్వం సమయంలో అనేక అక్రమాలు జరిగాయి. అవినీతి, అక్రమాలు జరిగినచోట చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో భూములు తమ అస్మదీయులకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. వేలాది కోట్లు దుర్వినియోగం చేసింది’ అని జీవీఎల్ టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘ప్రజా ప్రయోజనం కోసం విచారణ జరగాలి. రాజధాని భూములలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది బహిరంగ రహస్యం. అయితే ఎలా జరిగిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
పోలవరం అవినీతిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి : జీవీఎల్
సాక్షి, పోలవరం : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులను మార్చడానికే పరిమితం కాకుండా దుబారా జరిగిందని స్పష్టత ఉన్న వాటిపై బాధ్యులను కూడా నిర్ణయించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పోలవరంలో పర్యటించిన ఆయన... ఇప్పటి వరకు చేసిన వ్యయం, ఇకపై జరిగే నిర్మాణ వ్యయాన్ని ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం నిర్వాసితుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని సిఏజే రిపోర్ట్ స్పష్టం చేసిన నేపథ్యంలో అవినీతి ఎవరు చేశారు? ఎవరు బాధ్యత వహించాలి? ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే వాటిపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేవంటూ ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. తదనంతరం నిర్వాసితుల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. -
కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తే టీడీపీకి ఎందుకు బాధ?
సాక్షి, ప్రకాశం: గతంలో చేపట్టిన కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుంటే టీడీపీ వాళ్లు ఎందుకు అంతలా బాధపడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. కాంట్రాక్టులలో తప్పు జరిగినప్పుడు వాటిని రద్దు చేయడంలో తప్పు లేదని, తప్పు జరగకుండా కావాలని రద్దు చేస్తే తప్పన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు కాంట్రాక్టర్లని టీడీపీ ఎందుకు వెనకేసుకొస్తోందని నిలదీశారు. టీడీపీ ఏమైనా కాంట్రాక్టర్ల పార్టీనా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీ అభివృద్ధిని పట్టించుకోలేదనీ, ఎన్నికల పేరుతో శంకుస్థాపనలంటూ హడావుడి చేసిందనీ విమర్శించారు. రామాయపట్నం పోర్టు విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాయకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి సమస్యతో పాటు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అయినా ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానన్నారు. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులకు ఆమోదం తెలిపిందని, ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. -
'కశ్మీర్‌ను ఓట్ల కోసమే వాడుకున్నాయి'
సాక్షి, విజయవాడ : జమ్మూ కశ్మీర్ ప్రజల్ని గత ప్రభుత్వాలు కేవలం ఓట్లు కోసం మాత్రమే వాడుకున్నాయని రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు విమర్శించారు. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు కలిసివచ్చి ఆర్టికల్ 370 బిల్లు రద్దుకు సహకారం అందించడం గొప్ప విషయమని తెలిపారు. రామయ్యపట్నంలో పోర్టు నిర్మాణం విఝయంలో ఏపీ ప్రభుత్వం లిఖిత రూపంలో కేంద్రాన్ని కోరితే పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు తాను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకోకుండా, ప్రజల కోసం చాలా కష్టపడ్డానంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. గతంలో సాధ్యం కావు అని చెప్పిన విషయాలనే జగన్ ప్రభుత్వం మళ్లీ అడగడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. ఎన్ఎంసీ బిల్లు విషయంలో అపోహలు వద్దని, బిల్లు విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే చర్చల ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు. యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోదని జీవిఎల్ స్పష్టం చేశారు. -
‘విభజన హామీలు నెరవేర్చుతాం’
సాక్షి, న్యూఢిల్లీ : విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చట్టంలో పేర్కొన్న విభజన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. పది జాతీయ సంస్థలను విభజిత ఏపీలో నిర్మించాలని చట్టంలో పేర్కొన్నారని, పది ఏళ్లలో వీటిని నిర్మించాలని చట్టంలో పొందుపరిచారని చెప్పారు. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మంగళవారం రాజ్యసభలో జీవీఎల్ మాట్లాడుతూ 2015-16లోనే ఏపీలో జాతీయ విద్యాసంస్ధలను ఏర్పాటు చేశామని, అదే ఏడాది ఐఐటీ తరగతులను ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదని, ఒక ప్రాంతానికే అభివృద్ధి పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కలే జాతీయ సంస్ధలు ఏర్పాటయ్యాయని అన్నారు. విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందనే భావన అక్కడి ప్రజల్లో నెలకొందని చెప్పారు. -
పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి
న్యూ ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ ఎంపీ జీ వీ ఎల్ నరసింహారావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా తక్కువ నాణ్యత కలిగిన పొగాకు కిలో రూ.20 చొప్పున ధరను అమలు చేయాలని కోరారు. అదే విధంగా పంట మార్పిడికి నష్ట పరిహారంగా ఒక బారన్ పొగాకుకు సుమారు రూ. 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు అహంకారం, అవినీతి వల్లే
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్ మీద నమ్మకం ఉంచి ప్రజలు ఆయనకు భారీ విజయం కట్టబెట్టారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు అహంకారం, అవినీతే టీడీపీని ఓటమి పాలు చేసిందని విమర్శించారు. అవినీతి పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడారని హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోదీ గురించి టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ముక్కముక్కలుగా నరుకుతామని ప్రతిపక్ష నేతను బెదిరించేవారు. కోడికత్తి పార్టీ అంటూ వైఎస్సార్ సీపీని చంద్రబాబు హేళన చేసేవారు’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు. టీడీపీ కుట్రల వల్లే.. ఏపీలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని జీవీఎల్ విచారం వ్యక్తం చేశారు. తమ ఓటమికి టీడీపీ కుట్రపూరిత రాజకీయాలే కారణమని ఆరోపించారు. బీజేపీ వంశపారంపర్య రాజకీయాలకు దూరమని, వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్, రాహుల్, కవిత ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అభివృద్ధిని చూసిన దేశ ప్రజలు రెండోసారి గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. -
‘చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలమే’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి సింగల్ డిజిట్ సీట్ల మాత్రమే వస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు జోస్యం చెప్పారు. మే 23 తర్వాత రాజకీయాల్లో చంద్రబాబు ప్రాతినిధ్యాన్ని కోల్పోతారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో కూడా అనుమానమేనని అన్నారు. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు ఉన్నాయని జీవీఎల్ విశ్లేషించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి రాబోతుందని హెచ్చరించారు. చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు. శనివారం జీవీఎల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రానుంది. ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు పూర్తి అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం కూడా పెరగనుంది. అభివృద్ధి ఆధారంగానే మోదీ మూడుసార్లు సీఎం అయ్యారు. మరోసారి ప్రధానిగా ఎన్నిక కాబోతున్నారు. బీజేపీ సీట్ల సంఖ్య మరింత పతాక స్థాయికి చేరబోతోంది. మిషన్ 2024 తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, కేరళలో పెద్ద శక్తిగా ఎదుగుతాం. టీడీపీ ఓటమితో మాపార్టీ మిషన్ ప్రారంభం అవుతుంది. బీజేపీ అభివృద్ధికి టీడీపీ ఓటమితో నాంది పలుకుతాం. ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండంగా మారాయి. కాంగ్రెస్‌కు 50-60 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. సోనియా లేఖకు స్పందించి పార్టీలేవీ పొరపాటు చేయవని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి -
చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి
-
ఎంపీ జీవీఎల్‌పైకి బూటు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఆయనపైకి రెండు బూట్లు విసిరాడు. మొదటి బూటు జీవీఎల్‌కు దూరంగా వెళ్లగా.. రెండోది ఆయనకు అతి సమీపం నుంచి వెళ్లింది. ఈ ఘటనతో జీవీఎల్ షాకయ్యారు. అప్రమత్తమైన పార్టీ కార్యాలయ సిబ్బంది బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి యూపీలోని కాన్పూర్‌కు చెందిన వైద్యుడు శక్తి భార్గవగా గుర్తించారు. అతను ఒక ఆస్పత్రి నడుపుతున్నట్టు విజిటింగ్ కార్డు లభ్యమైంది. దాడికి కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.దీనిపై స్పందించిన జీవీఎల్ ఇలాం టి దాడులకు తాను భయపడబోనని అన్నారు. -
ఎన్నికలు ముగిసినా బాబు హడావుడి తగ్గలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు అతీతంగా పని చేస్తుందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్నికలు ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హడావుడి తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంపై అభ్యంతరకరంగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబు రాజకీయ విమర్శలు చేసి ఓటమిని తప్పించుకోలేరన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో తనపై జరిగింది దాడిగా భావించడం లేదన్నారు. (గురువారం జీవీఎల్ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా శక్తి భార్గవ వ్యక్తి అనూహ్యంగా ఆయనపైకి బూటు విసిరాడు. వేగంగా దూసుకొచ్చిన బూటు జీవీఎల్ ముఖం దాటి ఆయన భూజానికి తాకింది. దీంతో జీవీఎల్ ఒక్కసారిగా షాకయ్యారు) దాడులకు భయపడను... ఇలాంటి దాడులకు తాను భయపడబోనని జీవీఎల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లే ఇలాంటి దాడులు చేస్తారని, ఇది కాంగ్రెస్ ప్రేరేపిత దాడిగా ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మరోసారి జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసులో సదురు వ్యక్తి చేసిన హడావుడి తనను ఉద్ధేశించి చేసింది కాదన్నారు. ఆ వ్యక్తిపై గతేడాది ఆదాయ పన్ను శాఖ దాడులు చేసిందని, అతని దగ్గర రూ. 500 కోట్ల విలువైన బంగ్లాలు ఉన్నట్టు గుర్తించిందని తెలిపారు. ప్రస్తుతం అతను ఐటీ విచారణ ఎదుర్కొంటున్నాడని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ తన పని తాను చేసుకుపోతుంటే పార్టీ ఆఫీసులో హడావుడి చేయడం వెనుక ఉద్ధేశం ఏమిటన్నది పోలీసులు నిర్ధారిస్తారని జీవీఎల్ తెలిపారు. దాడిని ఖండించిన కన్నా లక్ష్మీనారాయణ అమరావతి: జీవీఎల్ నరసింహారావుపై జరిగిన దాడిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రేరేపిత చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు బీజేపీ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. తిరిగి మోదీ ప్రధాని అవటాన్ని చూసి ఓర్వలేక, సైద్దాంతిక రాజకీయాలను ఎదుర్కొనలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మే 23న వచ్చే ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టు కాగలవన్నారు. -
జీవీఎల్‌పై చెప్పు: ఎవరీ శక్తి భార్గవ!
న్యూఢిల్లీ : బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయనపై శక్తి భార్గవ అనే వ్యక్తి చెప్పు విసిరేశాడు. జీవీఎల్‌పై ఆగ్రహంతో చెప్పు విసిరిన ఈ శక్తి భార్గవ ఎవరని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్తులు, అక్రమ సంపద ఉందనే ఆరోపణలతో ఆయనపై గతంలో ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది. భార్గవ ఆస్పత్రుల అధినేత అయిన శక్తి భార్గవకు పలు కంపెనీలు ఉన్నాయి. శక్తి భార్గవ ఇటీవల మూడు భవనాలు కొనుగోలు చేశాడు. ఇందుకోసం తన ఖాతా నుంచి రూ. 11.5 కోట్లు చెల్లించాడు. తన భార్య, పిల్లలు, బంధువులు ఇలా పలువురి పేర్ల మీద ఆయన బంగ్లాలు కొన్నాడు. అయితే, తనకు తాను శక్తి భార్గవ విజిల్ బ్లోయర్‌గా చెప్పుకుంటుండగా.. అతని తల్లిదండ్రులు మాత్రం అతనిపైన, అతని భార్యపైన వేధింపుల కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ బంగ్లాలు తాము కొనుగోలు చేశామని, కానీ, అక్రమ వ్యవహారాల ద్వారా ఆ మూడు బంగ్లాలను తన భార్య, పిల్లలు, బంధువుల పేర్ల మీదకు శక్తి భార్గవ బదలాయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రూ. 11 కోట్లు పెట్టి తాము భవనాలు కొనుగోలు చేస్తే.. వాటిని అక్రమమార్గంలో రూ. 11.5 కోట్లకు కొన్నట్టు శక్తిభార్గవ కొన్నాడని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అయితే, శక్తిభార్గవ లాయర్ అభిషేక్ అత్రే మీడియాతో ఆయన మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని, ఆయనకు పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆయన ప్రవర్తనతో విసిగిపోయి గతంలోనే ఆయనకు లాయర్‌గా సేవలందించడం మానేశానని అత్రే తెలిపారు. 2018లో లక్నో, కాన్పూర్, వారణాసిలోని శక్తిభార్గవ నివాసాలు, కార్యాలయాలపై ఐటీశాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఐటీ శాఖ రూ. 28 లక్షలు, రూ. 50 లక్షలు విలువచేసే నగలు స్వాధీనం చేసుకుంది. మూడు బంగ్లాలకు సంబంధించి దాదాపు రూ. 10 కోట్ల ఆదాయానికి సంబంధించి లెక్కలను ఐటీ శాఖ విచారణలో శక్తి భార్గవ చెప్పలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన, ఆయన బంధువుల పేరిట ఉన్న ఎనిమిది కంపెనీలకు సంబంధించిన వివరాలు ఆదాయపన్నుశాఖకు, ప్రభుత్వ ఏజెన్సీలకు తెలుపలేదని ఐటీ విచారణలో గుర్తించారు. -
జీవీఎల్‌పై బూట్లతో దాడి
-
జీవీఎల్‌పై బూటు విసిరిన విలేఖరి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అనూహ్యంగా ఆయనపైకి బూటు విసిరాడు. వేగంగా దూసుకొచ్చిన బూటు జీవీఎల్ ముఖం దాటి ఆయన భూజానికి తాకింది. దీంతో జీవీఎల్ ఒక్కసారిగా షాకయ్యారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షూ విసిరిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శక్తి భార్గవ్‌గా గుర్తించారు. అయితే, అతను ఎందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. శక్తిభార్గవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శక్తి భార్గవ్ ఓ పాత్రికేయుడని, నరేంద్ర మోదీపై అసంతృప్తితోనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. -
ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమైంది
-
సీఎం రమేష్ ఇంటీపై పోలీసుల దాడులు బూటకం
-
‘బాలకృష్ణకు పిచ్చి ముదిరింది’
ఢిల్లీ: అవినీతి మా జన్మ హక్కు అన్నట్లుగా టీడీపీ తయారైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకులు దొంగతనం చేసినట్లు చంద్రబాబు వాంగ్మూలం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్(ఈసీ) ఆధ్వర్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం గానీ, సొంతంగా ఆదాయపన్ను శాఖ గానీ ఈ దాడులు చేయడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలాతో జరిగే సోదాలు కావని తెలిపారు. తన నివాసంలో పోలీసులు సోదాలు చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెబుతున్నారు.. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తారని ఆయనకు తెలిసినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతోనే పోలీసులు సోదాలు నిర్వహించారని వెల్లడించారు. బాబు తప్పుడు మాటలు మానుకోవాలి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు మానుకోవాలని జీవీఎల్ సూచించారు. ప్రతి దానికి నరేంద్ర మోదీని విమర్శించడం సరైంది కాదన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల రూపాయల జరిమానా విధించడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకి తన ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా నదిలో పర్యావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. టీడీపీ నాయకులే ఆ వంద కోట్ల రూపాయల జరిమానా కట్టాలి.. ప్రజాధనం నుంచి రూ.100 కోట్లు చెల్లించకూడదు.. చంద్రబాబుపై వ్యక్తిగతంగా జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. బాలకృష్ణకు పిచ్చి ముదిరింది సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పిచ్చి మరింత ముదిరిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.గతంలో తనకు మెంటల్ అని బాలకృష్ణ సర్టిఫికెట్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పిచ్చి ఇప్పుడు మరింత ముదురుతోందని అన్నారు. మీడియాపైనా, ప్రజలపైన, టీడీపీ కార్యకర్తలపై బండ బూతులతో బాలకృష్ణ విరుచుకు పడుతున్నారని విమర్శించారు. మతిస్థిమితం లేని బాలయ్యను చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయాలని సూచించారు. రైతు రుణమాఫీ ఇంతవరకు పూర్తిగా చంద్రబాబు చేయలేదు..అన్నదాత సుఖీభవ పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టి స్టిక్కర్ బాబుగా మారారని ఎద్దేవా చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: జీవీఎల్
-
‘ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం’
విజయవాడ: ఏపీలో ఎన్నికల సందర్భంగా తప్పుడు రాజకీయాలు, తప్పుడు ప్రచారాలను టీడీపీ చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను కేంద్ర ప్రభుత్వం కాపాడే యత్నం చేస్తోందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, జగన్‌ను కాపాడాల్సిన అవసరం బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ హయాంలో ఏ నాయకుడిని కాపడటం కానీ టార్గెట్ చేయడం కానీ జరగలేదని అన్నారు. టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు చూస్తుంటే వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనిపిస్తోందని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ పలుమార్లు సభలు పెట్టి ప్రచారం చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పచ్చ కండువా కప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీనిని బట్టి చూస్తేనే టీడీపీకి ఆయనతో ఉన్న బంధం ఏంటో అర్ధమవుతుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల, ధన రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. అమరావతి, విశాఖలో టీడీపీ నాయకులు వేల ఎకరాలు దోచేశారని ఆరోపించారు. ఏపీలో ప్రాంతీయపార్టీలకు నిబద్ధత, నిజాయతీ లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీ అవ్వాలంటే అడ్డగోలుగా అవినీతి, ఈడీ కేసులు వంటివి తప్పనిసరిగా ఉండాలని ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖల ఆరోపణలు ఎదుర్కొనే వారంతా కూడా టీడీపీ అభ్యర్ధులేనని విమర్శించారు. -
చంద్రబాబు హోదా పేరుతో ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారు
-
‘చంద్రబాబు ముక్కుపిండి వసూలు చేస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హోదా పేరుతో ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రజల సొమ్మును పార్టీ అవసరాలకు ఉపమోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా ఉపయోగిస్తే మళ్లీ తిరిగి రాబట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు దుబారా ఖర్చులను తిరిగి చెల్లించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని జీవీఎల్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజల డబ్బును పార్టీ అవరసరాలకు ఉపయోగించినందుకు ప్రజలే చంద్రబాబు ముక్కుపిండి వసూలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నులైన ముఖ్యమంత్రి చంద్రబాబేనని.. తన సొమ్మును పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకోలేరా? అని ప్రశ్నించారు. -
‘ఏపీలో హీరో ఎంటర్ కాబోతున్నాడు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా క్లైమాక్స్‌కు వచ్చిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. రేపు హీరో ఏపీలో ఎంటర్ కాబోతున్నాడని, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్ధేశించి మాట్లాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా క్లైమాక్స్‌లో హీరోనే విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రజా కార్యక్రమం కోసమే ఏపీ వస్తున్నారని, ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకటం సంప్రదాయమన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో డ్వాక్రా మహిళలకు ఎందుకు పసుపు, కుంకుమ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు చేసిన నాలుగు మంచి పనులు చెప్పమంటే మొహం చాటేస్తున్నారన్నారు. మోదీ ఎవరికైనా లక్ష కోట్లు ఇస్తామని చెప్పారా?: సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష కోట్లు ఇస్తామని చెప్పలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మోదీ ఎవరికైనా లక్ష కోట్లు ఇస్తామని చెప్పారా అంటూ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానికి మట్టి, నీరు తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారని, దానిలో భాగంగా మోదీ రాజధానికి పవిత్రమైన మట్టి, నీరు తెచ్చారని పేర్కొన్నారు. మోదీ తెచ్చిన మట్టి, నీరు చూసి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు సొంత మీడియా లక్ష కోట్లు ఇస్తారంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బులకు చంద్రబాబు ముందు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘రిజర్వ్’ నిధులు
‘రిజర్వ్’ నిధులు ‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ రిజర్వ్‌బ్యాంక్ మూలధనంపై కన్నేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతకు, మన కరెన్సీకి సుస్థిరతకు ఆర్బీఐ దగ్గర ఈ నిల్వ అవసరం. ఈ విషయంలో ప్రభుత్వ ఒత్తిళ్లతో ఇప్పటికే అసాధారణ రీతిలో ఇద్దరు గవర్నర్లు నిష్క్రమించారు. అయినా కేంద్ర ప్రభుత్వం దీన్నుంచి ఏమీ నేర్చుకోలేదని అర్ధమవుతోంది’’ – సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి (‘రిజర్వ్’ నిధులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కన్నేసిందన్న కథనం చూశాక) వివేకం కలగాలి ‘‘ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని విధాలా అర్హులైన వారికి విశిష్ట పురస్కారాలు ప్రకటిస్తే కొందరు దీన్ని రాజకీయం చేయడానికి పూనుకోవడం బాధాకరం. ఆ బాపతు వారికి ఆ భగవంతుడే వివేకం కలిగించాలి. అందుకు వారిని అనుగ్రహించాలి’’ – జీవీఎల్ నరసింహారావు బీజేపీ అధికార ప్రతినిధి ద్వంద్వ ప్రమాణాలు ‘‘బ్లాగ్ మంత్రి’ అరుణ్ జైట్లీ త్వరితంగా కోలు కోవాలని ఆకాంక్షి స్తూనే చందా కొచ్చ ర్‌పై ఆయన చేసిన ప్రకటనను తప్పుబట్టక తప్పడం లేదు. అది అసాధారణమైనది. మరోరకంగా ఐసీఐ సీఐ కేసులో అడుగు ముందుకేయొద్దని సీబీఐని కోరడమే. ఇలాంటి ద్వంద్వ ప్రమా ణాలు సరికాదని ఆయన గుర్తించాలి’’ – జైరాం రమేష్, కాంగ్రెస్ నాయకుడు అత్యున్నత విలువ ‘‘మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సరిగ్గా ఇదే రోజు ఆవిష్కృత మైన మన రాజ్యాంగం మీ తల్లిగారికి, ఆమె లాంటి అనేకులకు ఒక నిరర్థక హామీ పత్రంగా మిగిలి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ మనం నిలబెట్టుకునేందుకు పోరాడి తీరవ లసిన ఏకైక ఆదర్శం అదొక్కటేనని మీరు గుర్తించండి’’ – సంజయ్ హెగ్డే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పతాక విలువలు ‘‘సమాజంలో చీలికలు విస్తరిస్తుంటే, విద్వేషాలు భయంకరంగా రేగుతుంటే మన త్రివర్ణ పతాకం వినువీధిలో రెపరెపలాడుతూ మనలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది. తన అత్యున్నత విలువలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందుకోమని మనందరికీ పిలుపునిస్తోంది’’ – సాగరికా ఘోష్, సీనియర్ జర్నలిస్టు (గణతంత్ర దినోత్సవం సందర్భంగా) -
‘చంద్రబాబుకు మోదీ భయం పట్టుకుంది’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రధాని నరేంద్ర మోదీ భయం పట్టుకుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం బీజేపీ ఎంపీ హరిబాబుతో కలిసి ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు డ్రామా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. యూసీలు అడిగితే తామేమన్న గుమస్తాలమా అంటున్న టీడీపీ నేతలకు ప్రభుత్వ అధికారులంటే అంత చులకనగా కనబడుతున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నట్టేటా ముంచిందని ఎద్దేవా చేశారు. 600 హామీలు ఇచ్చిన టీడీపీ వాటిని అమలు చేయకుండా డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇస్తున్న చంద్రబాబు కేంద్రాన్ని నిందిస్తూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు నిర్మాణానికి 8 నెలల సమయం ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం కట్టలేకపోయిందని.. అలాంటి వారు ప్రపంచంలోనే 4వ పెద్ద రాజధాని నిర్మిస్తామంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుని తిడుతున్నారో, పొగుడుతున్నారో ఆ పార్టీ నేతలనే అడగాలన్నారు. హరిబాబు మాట్లాడుతూ.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 2018-19 ఏడాదికి గానూ 6243 కోట్ల రూపాయల నరేగా నిధులు విడుదలయ్యాయని తెలిపారు. గతేడాది కంటే ఈ సారి వెయ్యి కోట్లు అదనంగా నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం చేస్తున్న సహాయాన్ని టీడీపీ చిన్నదిగా చూపే ప్రయత్నం చేయడం మంచింది కాదన్నారు. కాంగ్రెస్‌ది నక్క తోక కాదని.. అది కుక్క తోక మాత్రమేనని వ్యాఖ్యానించారు. -
టీడీపీ చౌకబారు రాజకీయాలు మానుకోవాలి
-
బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మతిభ్రమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు విభజనపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఏపీ హైకోర్టు నూతన భవనాన్ని డిసెంబర్ 15, 2018 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని, అందువల్ల హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. దాని ఆధారంగానే జనవరి 1, 2019 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారన్నారు. భవన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడం చేతకాని చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు కేంద్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకొనే చంద్రబాబుకు ఏపీలో రెండు అంతస్తుల హైకోర్టు భవనాన్ని నిర్మించడం చేత కాలేదని విమర్శించారు. హైకోర్టు నిర్మాణం ఆలస్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి ఉంటే దాని ఆధారంగా న్యాయస్థానం తగిన ఆదేశాలు ఇచ్చివుండేదన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును సైతం టీడీపీ ప్రభుత్వం తప్పుదోవపట్టించిందన్నారు. కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన టీడీపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి ఏపీ హైకోర్టులో మొదటి కేసుగా దాన్నే విచారించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు కార్యకలాపాలను తన క్యాంప్ ఆఫీసులలో ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు న్యాయవ్యవస్థను తీవ్రంగా అవమానించారన్నారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, చెప్పిన సమయానికి భవన నిర్మాణం పూర్తిచేయలేక న్యాయమూర్తులను, న్యాయవాదులను రోడ్డుమీద నిలబడేలా చేసినందుకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ జారీ కాగానే ఇదంతా తమ వల్లే సాధ్యమైందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియా ముందు డబ్బాకొట్టుకున్నారని జీవీఎల్ గుర్తు చేశారు. మీపై ఉన్న కేసులు విచారణకే రావడం లేదెందుకు? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేసులకు, హైకోర్టు విభజనకు లింకుపెడుతున్న చంద్రబాబు ముందు తనపై ఉన్న అనేక కేసులు అసలు విచారణకే రావడంలేదెందుకని జీవీఎల్ ప్రశ్నించారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసు విచారణ జరగడం లేదెందుకో వివరించాలన్నారు. ఇతరుల కేసుల విచారణపై ఆక్షేపించేముందు చంద్రబాబు తన నిజాయితీ ఏస్థాయిలో ఉందో తెలుసుకుంటే మంచిదన్నారు. -
ఇంత చేతగాని సీఎంను జన్మలో చూడలేదు
-
‘ఏపీ దాటేంత సీన్ టీడీపీకి లేదు’
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడటం దారుణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడిపై దాడి జరిగినా సీరియస్‌గా తీసుకోవాల్సిందిపోయి..చంద్రబాబు చౌకబారు విమర్శలు చేయడం సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపానుతో రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్లడం సిగ్గుచేటన్నారు. తిట్లీ తుపాను విషయంలో కూడా చంద్రబాబు చేసింది తక్కువా..ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. విపత్తుల సమయంలో చంద్రబాబు వేరే ప్రాంతాలకు వెళ్లడం పరిపాటిగా మారిందని విమర్శించారు. మూడేళ్లలో స్టేట్ డిజాస్టర్ ఫండ్ కింద ఏపీకి రూ.1247కోట్లు వచ్చాయని, ఎంతమేరకు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ పార్టీ కాదని, ఏపీని దాటేంత సీన్ కూడా ఆ పార్టీకి లేదన్నారు. ఈ విషయం తెలంగాణ ఎన్నికల్లో రుజువైందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మాదిరిగానే ఏపీలోనూ టీడీపీ పరిస్థితి అదే విధంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రచారం వల్లే తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి సీట్లు రాకున్నా ఓట్ల శాతం పెరిగిందని, ఛత్తీస్‌గఢ్ ఫలితాలు నిరాశ కలిగించాయని తెలిపారు. లోక్ సభ ఫలితాలు మాత్రం బీజేపీ అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
‘ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే.. బీజేపీ కీ రోల్’
సాక్షి, వరంగల్ : ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పటికీ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వడం లేదని రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహ రావు తెలిపారు. కేసీఆర్, కూటమిని ప్రజలు ఎవ్వరు నమ్మడం లేదన్నారు. టీఆర్ఎస్, కూటమికి స్పష్టమైన మెజారిటీ రాదని పేర్కొన్నారు. తెలంగాణలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీ రోల్ పోషిస్తుందన్నారు. హన్మకొండలోని బీజేపీ అర్బన్ ఆఫీస్‌లో శనివారం జీవీఎల్ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అన్నారు. కాంగ్రెస్ బలం సరిపోక రూ.500 కోట్లకు కక్కుర్తిపడి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కానీ, చంద్రబాబు నాయుడును చూసి కూటమి నేతలు జంకుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కంట్రాక్టు రూపంలో టీడీపీతో జత కట్టిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరంగల్ తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు అని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అధికారాన్ని ఉపయోగించి భూకబ్జాలు చేశారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చినా కేసీఆర్ పాలన చేయలేకపోయారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబంలో తప్ప ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు అన్ని కుటుంబ పార్టీలేనని, మూడు పార్టీలు పుత్రదాహం కోసం ఆరాట పడుతున్నాయన్నారు. -
కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్
-
ఒవైసీకి ఇవ్వలనుకున్న డబ్బు ఎక్కడిది?
-
లోకేష్‌కు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటీ?
-
రచ్చకెక్కిన టీడీపీ, బీజేపీ చర్చ
తాడేపల్లిగూడెం, రూరల్, తాడేపల్లి రూరల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధుల మధ్య అభివృద్ధిపై చర్చ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో మోహరించడంతో పోలీసులు 144 సెక్షన్ విధించి, ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్టు చేశారు. బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇంటి గోడ దూకి మరీ చర్చా వేదిక వద్దకు వెళ్లేందుకు సన్నద్ధం కాగా పోలీసులు అడ్డుకుని బలవంతంగా లోపలికి పంపారు. మాణిక్యాలరావుకు మద్దతుగా వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులను పోలీసులు గుంటూరు జిల్లా సరిహద్దులోనే ఆపేశారు. ఇటీవల పెంటపాడులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఒకరికొకరు ప్రెస్మీట్ల అనంతరం బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు ఈ నెల 6వ తేదీన జెడ్పీ చైర్మన్ బాపిరాజు (టీడీపీ) సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు స్పందిస్తూ అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, వెంకట్రామన్నగూడెంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ చర్చకు వస్తానని బదులిచ్చారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. వెంకట్రామన్నగూడెంలో టీడీపీకి చెందిన జెడ్పీ చైర్మన్‌ను, గూడెంలో మాణిక్యాలరావు, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు (టీడీపీ)ను హౌస్ అరెస్టు చేశారు. గోడదూకి రోడ్డుపైకొచ్చిన మాణిక్యాలరావు బహిరంగ చర్చ నేపథ్యంలో బుధవారం రాత్రే జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వెంకట్రామన్నగూడెంలోని పుసులూరి పుల్లారావు నివాసానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు జెడ్పీ చైర్మన్‌ను అక్కడే గృహ నిర్బంధం చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బహిరంగ చర్చ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నించడంతో పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు బలవంతంగా ఇంటి గేట్లను తోసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు వెంకట్రామన్నగూడెం వెళ్లడానికి మాణిక్యాలరావు గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. అతన్ని అడ్డుకునే క్రమంలో రక్షణగా నిలచిన బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులపై పోలీ సులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను పోలీసులు బలవంతంగా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో బీజేపీ నేత సోము వీర్రాజు ఘటనాస్థలికి చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ సీన్ మారింది. బాపిరాజుకు దమ్ముంటే పోలీసు పికెట్స్ ఎత్తివేయించి పోలీసు వాహనంలో ఎమ్మెల్యేను చర్చకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ దొడ్డిదారిన తప్పించుకుని వెంకట్రామన్నగూడెం చేరుకోగా పోలీసులు బలవంతంగా వెనక్కు పంపారు. పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు.. ‘పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పోలీసులకు తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వడం లేదు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును పరామర్శించేందుకు ఎంపీలు గోకరాజు గంగరాజు, జి.వి.ఎల్.నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుతో కలిసి గుంటూరు నుంచి తాడేపల్లిగూడెం బయల్దేరగా మార్గం మధ్యలో తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గమ్మ వారధి వద్ద అర్బన్ జిల్లా నార్త్‌జోన్ సబ్ డివిజన్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎంపీలతో కలిసి జాతీయ రహదారిపై గంట సేపు బైఠాయించారు. కన్నా, జీవీఎల్లు.. విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నియంత పాలనతో అరాచకం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు వారిని బలవంతంగా జీపులో ఎక్కించి గుంటూరుకు తరలించారు. అనంతరం కన్నాను హౌస్ అరెస్ట్ చేశారు.కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నగరంపాలెం మీదుగా గుంటూరు మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎదుట సైతం బైఠాయించారు. పోలీసుల తీరుపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం వల్లే వారిని హోస్ అరెస్ట్ చేశామన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు బీజేపీ నాయకులు ప్రకటించారు. -
‘రాహుల్‌తో కలిసిన పార్టీలన్నీ ఫినిష్’
తిరుపతి(చిత్తూరు జిల్లా): దేశాన్ని రక్షిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు.. కానీ దాని అర్ధం తెలుగు దేశాన్ని రక్షిస్తానని చెప్పడమే.. ప్రజలు ఈ విషయం గమనించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. తిరుపతిలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న హడావిడి అంతా కాపాడటానికి కాదని దేశాన్ని కూల్చడానికేనని తీవ్రంగా విమర్శించారు. తానూ చిత్తూరు జిల్లా వాడినేనని, మా అమ్మ గారి సొంతూరు మదనపల్లి అని చెప్పారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విఫలం చెందారని ఆరోపించారు. తన సొంత జిల్లాలో అభివృద్ధి చేయలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లాలో సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేదని వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు బాబు బినామీలకు అప్పగింత రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చంద్రబాబు తన బినామీలకు అప్పజెప్పారని జీవీఎల్ ఆరోపించారు. రాయలసీమలో ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని ధ్వజమెత్తారు. నిన్న ఢిల్లీలో యూటర్న్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో చేసిన రాజకీయాల వల్ల దేశంలో ఎటువంటి మార్పు రాదని గ్రహించాలని హితవుపలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు. యూపీఏ కూటమి అవినీతి కూటమి, అప్రజాస్వామిక కూటమి, ఈ కూటమిలో చేరిన పార్టీలు భూస్థాపితం అవుతాయని జోస్యం చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని ఏ కూటములు ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని అన్నారు. 2019 తర్వాత టీడీపీ కనుమరుగు 2019 ఎన్నికలు టీడీపీకి ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయని, ఆ తర్వాత టీడీపీ పూర్తిగా కనుమరుగై పోతుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీతో కలిసిన పార్టీలన్నీ భూస్థాపితం అవుతాయని శాపనార్ధాలు పెట్టారు. కాంగ్రెస్‌తో పొత్తు, విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సరైన సమాచారం ఇవ్వలేదని, కేవలం అవగాహనా రాహిత్యంగా బీజేపీపై బురదజల్లే దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. దోలెరా నగరం ఏవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా చిత్తూరులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ త్వరలో రాబోతుందని తెలిపారు. చెన్నై-కోల్కత్తా ఇండస్ట్రీ కారిడార్ రావడం వల్ల ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏపీ రాబోతున్నాయని తెలిపారు. -
సీఎంకు భయమెందుకు?
సాక్షి, విశాఖపట్నం : వ్యాపారస్తులు, దొంగనాయకులపై ఐటీ దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రులకు భయమెందుకని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ దాడులు చేస్తుంటే సీఎం ఎందుకు ఉలిక్కి పడుతున్నారో చెప్పాలన్నారు. దొంగ సామాన్లు కొనే వారిలా చంద్రబాబు మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలుగు విజయ్ మాల్యాగా సీఎం రమేశ్ మిగిలిపోవడం ఖయమన్నారు. బీజేపీ పోరాటంతోనే అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూసిన టీడీపీ కాస్త వెనక్కి తగ్గిందన్నారు. హాయ్ ల్యాండ్‌పై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గిల గిల కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమి లేకపోయినా అప్పులు, ఆర్భాటాలు ఎక్కువ చేసిందని విమర్శించారు. సెన్సిటివిటీ లేకుండా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజమని, ఈ విషయంలో సెన్సిటివిటీ లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు. తమ పార్టీ చేస్తే ఈ స్థాయిలో దాడి చేయమని ఓ మంత్రి అనడం ఎంతవరకు సబబు అవుతుందో చెప్పాలన్నారు. ఇక్కడ సమాధానం చెప్పలేకనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దానికి తమకు సంబంధం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ రాష్ట్రంలో ఆపరేషన్ నరుడ అమలు చేస్తోందని ఆరోరపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జీవీఎల్ అన్నారు. -
మంత్రులున్నా,కంత్రీలున్నా జైలుకు వెళ్లకు తప్పదు
-
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
టీడీపీతో పొత్తు పొరపాటే : జీవీఎల్
సాక్షి, హైదరాబాద్ : గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం పొరపాటేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. అప్పుడున్న పరిస్థితుల్లో తప్పక టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీని ఎదగకుండా సీఎం చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని.. టీడీపీ పొత్తు బీజేపీకి గుదిబండలా తయరైందని వ్యాఖ్యానించారు. జీవీఎల్‌తో ఆదివారం సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. టీడీపీతో పొత్తు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ లేకుండా టీడీపీ అడ్రస్ గల్లంతయ్యేదని.. చంద్రబాబుది అవకాశ రాజకీయమని విమర్శించారు. ప్రత్యేక హోదాపై తమ ఆలోచనల ఏం మారలేదని, హోదా కాకుండా ప్యాకేజీ కావాలని అడిగింది చంద్రబాబేనని గుర్తుచేశారు. ఏపీ అభివృద్దికి బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘హోదాపై రెండు మాటలు మార్చింది చంద్రబాబే. ఆనాడు హోదా వల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు. హోదా కోసం ఉద్యమాలు చేస్తే జైల్లో పెడతామన్నది చంద్రబాబు కాదా?. ఆయన రోజుకో నాటకం ఆడుతున్నారు. చంద్రబాబుకు స్వార్థ ప్రయోజనాలే తప్ప.. విలువలు లేవు. ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నించినా జవాబు చెప్పే సత్తా సీఎంకు ఉండాలి. టీడీపీ అవినీతిపై ప్రశ్నిస్తే వారు మాపై విరుచుకుపడుతున్నారు. ఏపీలో లూటీ పాలన కొనసాగుతోంది. ప్రతీ స్కీంలో స్కాం జరుగుతోంది. చినామీలకు చంద్రబాబు దోచిపెడుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఐటీ దాడులు జరగడం సహజం. తప్పు చేయని వారు ఐటీ దాడులకు ఎందుకు భయడుతున్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమే కేంద్రంపై ఆరోపణలు. కేంద్ర యూసీలు అడిగితే చంద్రబాబు ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి అవసరమైన నిధులు ఇచ్చాం’’ అని వ్యాఖ్యానించారు. -
ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ఏం చేసింది?
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలపై మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదాలో చేసిందేమిటో ప్రజలకు వివరించాలని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ చేసిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క ధర్నా అయినా చేసిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిపై కోర్టుల్లో కేసు లు వేసి కాంగ్రెస్ చేతులు దులుపుకుందని, తీరా ఇప్పుడు మాత్రం అవినీతి అంటూ నానాయాగీ చేయటం బాలేదని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి ఓ రౌడీషీటర్’ సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రౌడీషీటర్ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపిం చారు. శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ సోదాలతో రేవంత్ అసలు స్వరూపం బయటపడిందన్నారు. రేవంత్‌రెడ్డిపై ఐటీ రిపోర్ట్ బయటకు వచ్చిందని, ల్యాండ్ సెటిల్మెంట్లు, భూకబ్జాల తో కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. రేవంత్ మామ దగ్గర రూ.11 లక్షలు, బావమరిది దగ్గర 1.2 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారన్నారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి దగ్గర రూ.1.40 కోట్లు దొరికాయని, కేఎల్ఎస్ఆర్ అనేది బినామీ సంస్థగా తేలిపోయిందన్నారు. -
‘రేవంత్ రాజకీయ నాయకుడా.. రౌడీ షీటరా’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ల్యాండ్ సెటిల్‌మెంట్ల్‌తో, భూ కబ్జాలతో రేవంత్ రెడ్డి కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఐటీ దాడులకు సంబంధించిన రిపోర్టులను శనివారం జీవీఎల్ మీడియాకు వెల్లడించారు. సెటిల్‌మెంట్ల్‌తో రూ.11 కోట్ల నల్లధనం వచ్చిందని రేవంత్ బావమరిది చెప్పారని.. రేవంత్ మామ వద్ద 11 లక్షల నగదు, 1.2 కిలోల బంగారం సీజ్ చేసినట్లు ఐటీ తెలిపిందని అన్నారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ డైరెక్టర్ వద్ద 1.40 కోట్లు దొరినట్ల ఐటీ వెల్లడించిందని పేర్కొన్నారు. జీవీఎల్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్ సోదరుడి కంపెనీ భుపాల్ ఇన్ఫ్రాటెక్ సబ్ కాంట్రాక్టు పనులు చేసింది. కూలీలకు డబ్బులు ఇచ్చామని అనేక రెట్లు పెంచి చూపించారు. భూ లావాదేవీలతో నల్లధనాన్ని సంపాధించి అక్రమాలకు పాల్పడ్డారు. రేవంత్ ఓటుకు కోట్ల కుంభకోణానికి కూడా పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడిలా లేడు.. రౌడీ షీటర్లా ఉన్నాడు. సీఎం రమేష్, రేవంత్ రెడ్డిలు అనేక వాటికి ట్యాక్స్‌లు ఎగకొట్టారు’’ అని అన్నారు. పీవీని అవమానించిన కాంగ్రెస్.. పన్నులు ఎగొట్టేవారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు బాగా ఉంటుందని జీవీఎల్ ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా పేరుతో రాహుల్ గాంధీ కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని.. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా రాహుల్ పాత్ర ఉందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్పుకున్నంత ఉత్తముడు కాదని.. దేశం కోసం సేవ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విషయంలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలను అవమానించిన పంజాబ్ మంత్రి సిద్దూపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. దక్షిణాది అంటే కాంగ్రెస్‌కే వివక్ష అని.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మృత దేహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లోకి తీసుకెళ్లలేదని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ అదేశాల వల్లనే పీవీకి అవమానం జరిగిందని.. రాజీవ్ కూడా అంజయ్యపై వివక్ష చూపించారని అన్నారు. రూ.100 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆధారాలు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రూ.100 కోట్ల టాక్స్ ఎగ్గొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని జీవీఎల్ పేర్కొన్నారు. నిజాయితీ పరులం అని బుకాయించారని, పెద్ద ఎత్తులో నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ప్రగల్బాలు పలికి బయటపడొచ్చు అనుకున్నారని తెలిపారు. అసలు మీకు వందల కోట్ల రూపాయలు ఎక్కడివి అని ప్రశ్నించారు. మీదేమైనా అంతార్జాతీయ సంస్థనా అని సీఎం రమేష్‌ను సూటిగా ప్రశ్నించారు. నీటి పారుదల రంగంలో ప్రాజెక్టుల పేరుతో అవినీతిని ఏరులై పారించారని తీవ్రంగా దుయ్యబట్టారు. పాతబస్తీనా.. పాకిస్తానా తెలంగాణలో బతుకమ్మ అడుతున్న మహిళపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఓల్డ్ సిటీ ఏమైనా పాకిస్తానా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాతబస్తీని ఒవైసీకి రాసిచ్చారా? అని అన్నారు. కేసీఆర్, కవిత తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవైసీకి తలవంచిన కేసీఆర్, విమోచన దినోత్సవం జరపకపోవడం సిగ్గుచేటని జీవీఎల్ అన్నారు. -
చంద్రబాబు బినామీ సీఎం రమేష్
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బినామీ సీఎం రమేష్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దిగజారుడు మనిషని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని కోరారు. జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలపై సీఎం రమేశ్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీసం మెలేసిన సీఎం రమేష్ జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలతో మీసం తీయించుకుంటారా అని సవాల్ విసిరారు. ఒక అవినీతి పరుడైన సీఎం రమేష్‌ని పబ్లిక్ కమిటీలో స్థానం కల్పించాలని సీఎం ఎలా రికమెండేషన్ చేస్తారని అడిగారు. సీఎం రమేష్‌పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు సీఎం రమేష్ తీరుపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీఎం రమేష్ వ్యవహరించే తీరు, పార్లమెంటు సభ్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవని అభిప్రాయపడ్డారు. సీఎం రమేష్ అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సీఎం రమేశ్ వాడే బాష పార్లమెంటు సంప్రదాయానికి విరుద్ధంగా ఉందన్నారు. ఐటీ పేరుతో లూటీ రాష్ట్రంలో ఐటీ పేరుతో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు లూటీ చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. సమాచార చట్టం ద్వారా ఐటీ కంపెనీలకు కేటాయించిన వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోకేష్ తన బినామీలకు ఐటీ కంపెనీల పేరుతో వేల కోట్ల రూపాయల భూమలు కేటాయిస్తున్నారని విమర్శించారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి లోకేష్‌కు ఐటీ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. 24 గంటల్లో ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూముల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. దొంగ దీక్షలు..తప్పుడు వ్యాపారాలు సీఎం రమేష్ దాదాపు రూ.100 కోట్ల టాక్స్ ఎగ్గొట్టారని, దొంగ దీక్షలు, తప్పుడు వ్యాపారాలు చేశారని జీవీఎల్ ఆరోపించారు. సొంత కంపెనీ అకౌంట్స్‌లోనే దొంగ లెక్కలు చూపించే వ్యక్తిని చంద్రబాబు పబ్లిక్ అకౌంట్స్‌లో మెంబర్‌గా చేశారని విమర్శించారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తుల వల్ల పార్లమెంటు పరువుపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే రమేష్ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని అర్ధం చేసుకోవలసి వస్తుందని అన్నారు. టీడీపీలో విలువలు లేవని చెప్పడానికి సీఎం రమేష్ ఒక ఉదాహరణ అని చెప్పారు. 2019 తర్వాత టీడీపీ కనుమరుగు 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కానుందని జోస్యం చెప్పారు. సీఎం రమేష్ వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఆయనపై విమర్శలు చేసిన వారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సారాయ కాంట్రాక్టర్, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
దొంగ దీక్షలు..తప్పుడు వ్యాపారాలు
-
ఐటీ దాడులు అంటే బాబుకు ఎందుకు దడ?
-
‘ప్రజలను మోసగించిన టీఆర్ఎస్’
సాక్షి,హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణం కలలను ప్రజలు నమ్మి టీఆర్ఎస్కు అధికారాన్ని అప్పగిస్తే ఇచ్చిన హామీలను విస్మ రించి ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీఆర్ఎస్ హామీ లను నమ్మి గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రజలు ఆ పార్టీకి మెజారిటీ ఇచ్చారని, అయితే ఏ హామీలను ఆయన నెరవేర్చలేదన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయ నందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ సీఎం అయ్యాక నిరుద్యోగులను గాలికొదిలేశారని, ఆయన కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. కేసీఆర్ వైఫల్యాల ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజలు బీజే పీని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అవినీతి, అబద్ధాలు చెప్పండంలో బాబు నంబర్ వన్
-
‘ఈర్ష్య పడేంత సీన్ ఏమి లేదు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి సేద్యంలో ఏ మేరకు ఫలితం సాధించారో ప్రజలకు చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితిలో పేరు తెచ్చుకుంటే మేము ఈర్ష్య పడుతున్నామన్నారు. ఆయన ప్రకృతి సేద్యంలో ఏమైనా సాధిస్తే కదా ఖ్యాతి...ఇది కేవలం వారికి వారు చేసుకునే ప్రచారం మాత్రమే. దీనికి ఆయన పార్టీ పట్ల జాలి పడడం తప్పా ఈర్ష్య పడేంత సీనేమి లేదు’ అని జీవీఎల్ అన్నారు. ఆత్మస్తుతి మానుకుని ప్రజల మీద దృష్టి పెడితే బాగుంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు గారు, నిన్న ప్రెస్ మీట్ లో మీరేదో ఐక్య రాజ్య సమితిలో ఖ్యాతి తెచ్చుకుంటే మేము ఈర్ష్య పడుతున్నాము అన్నారు. ప్రకృతి సేద్యంలో ఏమైనా సాధిస్తే గదా ఖ్యాతి! ఇది కేవలం మీరు చేసుకునే ప్రచారం,ఆత్మస్తుతి మాత్రమే. దానికి మీ పార్టీ పట్ల జాలి తప్ప ఈర్ష్య పడేంతగా ఏమీ సీన్ లేదు. @ncbn — GVL Narasimha Rao (@GVLNRAO) September 29, 2018 బాండ్ల విషయంలో పెట్టుబడులు పెట్టింది ఎవరు అమరావతి బాండ్ల కొనగోలుదారుల పేర్లు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. బాండ్లు పెట్టిందెవరు.. వారి వెనుక ఉందిదెవరో ప్రజలకు చెప్పాలన్నారు. అక్రమాలను రహస్య పత్రాలుగా చెబుతూ జీవోలను బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నాని జీవీఎల్ పేర్కొన్నారు. ఇవన్నీ చెబితే ప్రజలు చీత్కరించుకుంటారని భయపడుతున్నారని విమర్శించారు. బాబు వీటిలో నంబర్ వన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి, అప్పుల్లో, ఆర్భాటాల్లో నెంబర్ వన్ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో మాత్రం చంద్రబాబు లాస్ట్ అన్నారు. అనవసరపు ఖ్యాతికోసం పాకులాడితే భంగపాటు తప్పదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి డప్పు కొట్టించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబును మరోసారి గెలిపించే సాహసం ప్రజలు చేయరని విమర్శించారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని జీవీఎల్ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 6వ పెద్ద ఆర్థిక శక్తిగా తయారయిందన్నారు. మోదీలాగా చంద్రబాబు నాయుడు వరస విజయాలు సాధించారా అని ప్రశ్నించారు. మోదీకి విశ్వసనీయత ఉంది కాబట్టే చంద్రబాబు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. పూర్తిగా గాలిపోయిన సైకిల్‌కి బీజేపి గాలి నింపిందని ఎద్దేవా చేశారు. యూపీలో అఖిలేశ్ సైకిల్లో గాలి ఎలా పోయిందో.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ గాలిపోయిన సైకిల్‌గా మారిందన్నారు. -
‘దేశంలో ఏ పార్టీపై లేనంత ఆగ్రహం టీడీపీపై ఉంది’
సాక్షి, విజయవాడ : వైజాగ్ -చెన్నై కారిడార్ ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా వెచ్చించలేదని చేయలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. వైజాగ్-చెన్నై కారిడార్ ఖర్చులు రాష్ట్రం ప్రభుత్వ భరిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చెప్పెవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. రాష్టానికి కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పడం దారణమన్నారు. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన నోటీసులను కూడా రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు. దేశంలో ఏపార్టీపై లేనంత ఆగ్రహం టీడీపీ పై ప్రజలకు ఉందన్నారు. ఈ విషయం ఇటీవల ఓ జాతీయ సర్వేల్లో వెల్లడైందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోతుందని జీవీఎల్ తెలిపారు. -
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు
-
ఇది చంద్రబాబు మరో నాటకం
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద సెక్షన్ 144ను ఉల్లంఘించి డ్రామా నడిపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ కేసులో 22 సార్లు నోటీసులు వచ్చినా స్వీకరించకుండా కేసు తీవ్రమయ్యేలా చేసి మరో నాటకానికి తెరలేపారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు బాబ్లీకి వెళ్లి నాటకం ఆడారు. ఇప్పుడు చంద్రబాబుతో స్నేహంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ నాడు మహారాష్ట్రలో అధికారంలో ఉంది. పోరాటం పేరుతో డ్రామా చేయడానికి అప్పుడు ప్రయత్నించారు. చంద్రబాబు తనపై కేసులు రాకుండా అన్నిరకాల తంత్రాలు చేస్తూనే ఉంటారు. ఓటుకు కోట్లు కేసులోనూ ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. ఆయనపై ఉన్న కేసులన్నింటిలో స్టేలు ఉన్నాయి తప్ప పురోగతి లేదు. మీ మిత్రులు (కాంగ్రెస్) పెట్టిన కేసే ఇది. దీనికి, బీజేపీ ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదు. ప్రజలే మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపేయాలని ప్రజలే నిర్ణయించారు. మీరే కల్పించుకుని దొంగ సానుభూతి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవం కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా, ముఖ్యమంత్రి అయినా న్యాయవ్యవస్థ ముందు తలవంచకతప్పదు. మీరు నోటీసులను పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరిగింది. నిజంగా మీకేమైనా నోటీసులు వస్తే మీ అవినీతిపైనే.. మీరు చేసే దొంగనాటకాలపైన కాదు. మీకు నిజాయతీ ఉంటే పీడీ అకౌంట్ల విషయంలో సీబీఐ విచారణకు ఒప్పుకోవాలి. మీ అవినీతి బాగోతం బయటపడుతుంది. అవినీతిలో కూరుకుపోయిన మీ ప్రభుత్వం ప్రజాగ్రహం చవిచూడక తప్పదు. నోటీసులు వస్తాయని మీరు ముందస్తుగా>నే డప్పు కొట్టుకున్నారు.. వాటిపై ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. మీకు ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. 2016 నుంచి 22 నోటీసులు ఇస్తే మీకు తెలియదా? 22 నోటీసులు ఇచ్చినా మీకు అందలేదంటే ఆశ్చర్యంగా ఉంది. కేసు తీవ్రమయ్యేలా చేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. -
అవినీతిలో ఏపీ మొదటి స్థానం
-
‘మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాలు’
సాక్షి, విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాలు అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నాయని రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజా ధనంతో చంద్రబాబు ప్రభుత్వం దొంగ పోరాటాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తమ సమస్యల పరష్కారానికి ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, దీన్ని తరిమికొట్టేలా ఉపాధ్యాయలు కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు. విదేశీ పర్యటనల పేరుతో విలాసాలకు చేసినంత ఖర్చు కూడా ఈ ప్రభుత్వం విద్యా అభివృద్ధికి కేటాయించడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని అన్నారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఏపీలో అలా జరగడం లేదని చెప్పారు. నిధులను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక గృహాలకే పరిమితం అవుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణమన్నారు. అందుకే లెక్కలు చెప్పేందుకు భయపడుతున్నారని చెప్పారు. అమరావతి అభివృద్ధి పేరుతో వెయ్యి ఖర్చు అయ్యే చోట పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రూపంలో డబ్బును పార్టీ ఫండ్‌లోకి మారుస్తున్నారనే అనుమానం తమకుందని తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తున్నారు.. మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. మీరు చేసే ప్రతిపనిపైనా జాతీయ స్థాయిలో మా నిఘా కూడా ఉంటుంద’ని హెచ్చరించారు.