
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హోదా పేరుతో ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రజల సొమ్మును పార్టీ అవసరాలకు ఉపమోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా ఉపయోగిస్తే మళ్లీ తిరిగి రాబట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
చంద్రబాబు దుబారా ఖర్చులను తిరిగి చెల్లించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని జీవీఎల్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజల డబ్బును పార్టీ అవరసరాలకు ఉపయోగించినందుకు ప్రజలే చంద్రబాబు ముక్కుపిండి వసూలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నులైన ముఖ్యమంత్రి చంద్రబాబేనని.. తన సొమ్మును పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకోలేరా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment