
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు చాలా ధైర్యవంతుడని, అలాంటి నేత ఆత్మహత్యకు పాల్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మృతిపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు. రాజధాని, హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌దే నిర్ణయమని, కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. గతంలో రాయలసీమలోని ఒక్కోజిల్లాకు కేంద్రం రూ.50కోట్లు ఇచ్చిందన్నారు.
ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కేంద్ర నిధులకు లెక్కచెప్పమంటే చంద్రబాబు స్పందించలేదన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ సినిమా చూపించారంటూ ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment