
సాక్షి,హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణం కలలను ప్రజలు నమ్మి టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని అప్పగిస్తే ఇచ్చిన హామీలను విస్మ రించి ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీఆర్‌ఎస్ హామీ లను నమ్మి గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రజలు ఆ పార్టీకి మెజారిటీ ఇచ్చారని, అయితే ఏ హామీలను ఆయన నెరవేర్చలేదన్నారు.
ఏ ఒక్క హామీని అమలు చేయ నందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ సీఎం అయ్యాక నిరుద్యోగులను గాలికొదిలేశారని, ఆయన కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. కేసీఆర్ వైఫల్యాల ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజలు బీజే పీని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.