
సాక్షి, పోలవరం : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులను మార్చడానికే పరిమితం కాకుండా దుబారా జరిగిందని స్పష్టత ఉన్న వాటిపై బాధ్యులను కూడా నిర్ణయించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పోలవరంలో పర్యటించిన ఆయన... ఇప్పటి వరకు చేసిన వ్యయం, ఇకపై జరిగే నిర్మాణ వ్యయాన్ని ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలవరం నిర్వాసితుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని సిఏజే రిపోర్ట్ స్పష్టం చేసిన నేపథ్యంలో అవినీతి ఎవరు చేశారు? ఎవరు బాధ్యత వహించాలి? ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే వాటిపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేవంటూ ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. తదనంతరం నిర్వాసితుల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment