
టీడీపీ ఎంపీ కేశినేని నాని(పాత చిత్రం)
అమరావతి: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. అసలు జీవీఎల్ నరసింహారావుకు ఏపీలో అడ్రెస్సే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అడ్రెస్ ఒక చోట అయితే మాట్లాడేది మరొక చోట అని ఎద్దేవా చేశారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. జీవీఎల్ ఆధార్ కార్డు, పాస్‌పోర్టు ఎక్కడ ఉందో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. జీవీఎల్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
టీడీపీ హయాంలో వెయ్యి రూపాయల అవినీతి కూడా జరగలేదు..ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామని అన్నారు. లక్ష కోట్ల అవినీతిపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని పేర్కొన్నారు. గతంలో పార్లమెంటు దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ క్యాండిల్ ర్యాలీ చేసినపుడు పార్లమెంటుకు ముప్పు వస్తుందని కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీకి హోదా కోసం పోరాటం చేస్తుంటే పార్లమెంటుకి ముప్పు వస్తుందని జీవీఎల్ అనడం దారుణంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment