ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతిలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, నేతలు బినామీల ....
సీబీఐతో విచారణ జరిపించాలి
బెంగళూరు(బనశంకరి) : ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతిలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, నేతలు బినామీల పేరుతో బూ దందాకు పాల్పడి పేదలను మోసగించారని వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం నాయకులు, రైతులు ఆరోపించారు. ఎలక్ట్రానిక్ సిటీలోని దొడ్డతోగూరులో రైతులు రంగారెడ్డి, మల్లికార్జునరెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రులు బినామీ పేర్లుతో రాజధాని పరిధిలో వందలాది ఎకరాలు కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తారన్నారు. ఆ డబ్బుతోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదక్కాల్సిన అగ్రిగోల్డ్ ఆస్తులను లాక్కొని, అమరావతి చుట్టూ ఉన్న పేదల భూములను లాక్కున్నారని మండిపడ్డారు. భూ దందాపై సిట్టింగ్ జడ్జి, లేదా సీబీఐ తో విచారణ జరిపిస్తే నిజానిజాలు వెలుగుచూస్తాయన్నారు.