
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అబద్ధాలు ఆడే పార్టీ అని, తాజాగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిస్సిగ్గుగా అబద్ధాలాడారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.1,935 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని దేవినేని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఏవీ లేవని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన జవాబును ఈ ప్రకటనకు జోడించారు. 2018–19 సంవత్సరానికి సంబంధించి రూ.1,385 కోట్ల మేర వినియోగ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉందని పోలవరం అథారిటీ ఈ జవాబుపత్రంలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment