
సాక్షి, విశాఖపట్నం: ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని వనరులు విశాఖపట్నంలో ఉన్నాయని బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. దేశంలోనే టాప్ ఐటీ డెస్టినేషన్ సిటీగా విశాఖ నిలవనుందన్నారు. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు విశాఖకు వచ్చాయని, మరికొన్ని రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ హయాంలో ఊరూ, పేరు లేని ఐటీ కంపెనీలకు సబ్సిడీలిచ్చి ప్రభుత్వ సొమ్మును దురి్వనియోగం చేశారని మండిపడ్డారు. అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘విశాఖ అభివృద్ధి’ అజెండాతో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.రవీంద్ర పాల్గొన్నారు.