
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి సింగల్ డిజిట్ సీట్ల మాత్రమే వస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు జోస్యం చెప్పారు. మే 23 తర్వాత రాజకీయాల్లో చంద్రబాబు ప్రాతినిధ్యాన్ని కోల్పోతారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో కూడా అనుమానమేనని అన్నారు. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు ఉన్నాయని జీవీఎల్ విశ్లేషించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి రాబోతుందని హెచ్చరించారు. చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు.
శనివారం జీవీఎల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రానుంది. ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు పూర్తి అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం కూడా పెరగనుంది. అభివృద్ధి ఆధారంగానే మోదీ మూడుసార్లు సీఎం అయ్యారు. మరోసారి ప్రధానిగా ఎన్నిక కాబోతున్నారు. బీజేపీ సీట్ల సంఖ్య మరింత పతాక స్థాయికి చేరబోతోంది. మిషన్ 2024 తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, కేరళలో పెద్ద శక్తిగా ఎదుగుతాం. టీడీపీ ఓటమితో మాపార్టీ మిషన్ ప్రారంభం అవుతుంది. బీజేపీ అభివృద్ధికి టీడీపీ ఓటమితో నాంది పలుకుతాం. ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండంగా మారాయి. కాంగ్రెస్‌కు 50-60 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. సోనియా లేఖకు స్పందించి పార్టీలేవీ పొరపాటు చేయవని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి
Comments
Please login to add a commentAdd a comment