సాక్షి, విజయవాడ : బీజేపీతో జనసేన పార్టీ పొత్తా? విలీనమా? అనేది నేడు తేలనుంది. దీనిపై చర్చించేందుకు ఇరుపార్టీల ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన తరపున సమావేశంలో పాల్గొన్న వారిలో పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు.
మూడు రోజుల క్రితం హస్తినాలో మకాంవేసిన పవన్.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆతర్వాత బీజేపీ, జనసేన పొత్తుపై ప్రతిపాదనలు వచ్చింది. దీంతో జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవడమా లేదా పొత్తు కుదుర్చుకోవడమా అనే అంశంపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. అయితే దీనిపై బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుతో రహస్య పొత్తు కుదుర్చుకున్న పవన్‌తో కలిసి ఎలా పనిచేద్దామని కొంతమంద నేతలు ప్రశ్నింస్తుండగా, ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని మరికొంత మంది కొంతమంది ప్రతిపాదించినట్లు సమాచారం.
జనసేనతో భేటీకి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. జనసేన అధినేత పవన్‌తో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వచ్చే నాలుగేళ్లలో జనసేనతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చంచామని బీజేపీ సినియర్ నేత జీవీఎల్ అన్నారు. కేవలం అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలే తమ ఎజెండా కాదని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణ ఉంటుందన్నారు. 2024 ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జీవీఎల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment