
సాక్షి, విశాఖపట్నం : వ్యాపారస్తులు, దొంగనాయకులపై ఐటీ దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రులకు భయమెందుకని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ దాడులు చేస్తుంటే సీఎం ఎందుకు ఉలిక్కి పడుతున్నారో చెప్పాలన్నారు. దొంగ సామాన్లు కొనే వారిలా చంద్రబాబు మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలుగు విజయ్ మాల్యాగా సీఎం రమేశ్ మిగిలిపోవడం ఖయమన్నారు. బీజేపీ పోరాటంతోనే అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూసిన టీడీపీ కాస్త వెనక్కి తగ్గిందన్నారు. హాయ్ ల్యాండ్‌పై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గిల గిల కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమి లేకపోయినా అప్పులు, ఆర్భాటాలు ఎక్కువ చేసిందని విమర్శించారు.
సెన్సిటివిటీ లేకుండా మాట్లాడుతున్నారు
ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజమని, ఈ విషయంలో సెన్సిటివిటీ లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు. తమ పార్టీ చేస్తే ఈ స్థాయిలో దాడి చేయమని ఓ మంత్రి అనడం ఎంతవరకు సబబు అవుతుందో చెప్పాలన్నారు. ఇక్కడ సమాధానం చెప్పలేకనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దానికి తమకు సంబంధం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ రాష్ట్రంలో ఆపరేషన్ నరుడ అమలు చేస్తోందని ఆరోరపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జీవీఎల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment