‘దేశంలో ఏ పార్టీపై లేనంత ఆగ్రహం టీడీపీపై ఉంది’ | BJP MP GVL Narsimha Rao Firs On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే : జీవీఎల్‌

Published Tue, Sep 18 2018 5:56 PM | Last Updated on Tue, Sep 18 2018 6:37 PM

BJP MP GVL Narsimha Rao Firs On Chandrababu Naidu - Sakshi

జీవీఎల్‌ నరసింహరావు( ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ : వైజాగ్‌ -చెన్నై కారిడార్‌ ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా వెచ్చించలేదని చేయలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. వైజాగ్‌-చెన్నై కారిడార్‌ ఖర్చులు రాష్ట్రం ప్రభుత్వ భరిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చెప్పెవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.

రాష్టా‍నికి కంటే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పడం దారణమన్నారు. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన నోటీసులను కూడా రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు. దేశంలో ఏపార్టీపై లేనంత ఆగ్రహం టీడీపీ పై ప్రజలకు ఉందన్నారు. ఈ విషయం ఇటీవల ఓ జాతీయ సర్వేల్లో వెల్లడైందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోతుందని జీవీఎల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement