సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలు తీరును సమీక్షించాలని సీఎం తెలిపారు. ఏపీకి పార్లమెంట్ ఇచ్చిన హామీల అమలును సమీక్షించాలన్నారు. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు.
దశలవారిగా పోరాటం ఉధృతం చేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వదలిపెట్టేది లేదని, ఇక్కడ శాసనసభ, శాసన మండలిలో, అక్కడ లోక్‌సభ, రాజ్యసభలో ఏపీ సమస్యలే ప్రతిధ్వనించాలని తెలిపారు. లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారన్నారు. టీడీపీ ఏంపీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ అపాయింట్‌మెంట్ ఇవ్వక పోవడం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అవమానిస్తున్నారు? రాష్ట్రాన్ని అవమానిస్తారా అని ఆయన మండిపడ్డారు. ప్రజలే మనకు హైకమాండ్, ప్రజల ఆకాంక్షలే మనకు ముఖ్యమని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment