ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్ధసారథి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగు ఏళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అనుభవజ్ఞుడని అధికారమిస్తే రాష్ట్రాన్ని అంపశయ్య పై పడుకోబెట్టారని విమర్శించారు. ఎప్పుడెప్పుడు బాబుని సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అ