
'టీడీపీ ఎంపీలు తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారు'
ఢిల్లీ:లోక్ సభలో తెలుగుదేశం సభ్యులు తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారని తెలంగాణ ఎంపీలు మండిపడ్డారు. సభలో టీడీపీ ఎంపీల ప్రవర్తనపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలపై అనర్హత వేటువేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆపుతామని సీమాంధ్ర నేతల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అపోహలు పెంచుతున్నారని మరో ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ అనేది తెలంగాణలో ఒక భాగమన్న విషయాన్ని సీమాంధ్ర నేతలు గుర్తించుకోవాలన్నారు.