
అశోక్‌బాబు, దేవినేనిపై కేసులు పెట్టాలి: గుత్తా
సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర సభగా మారుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
నల్లగొండ: సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర సభగా మారుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్రలో సీఎం చాంపియన్ కావాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్వేషాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న అశోక్‌బాబు, దేవినేని ఉమలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనపై చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి వెల్లడించాలన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే ముసాయిదా బిల్లుపై అభిప్రాయం మాత్రమే ఉంటుందని, ఓటింగ్‌కు అవకాశం కూడా ఉండదని గుత్తా సుఖేందర్ రెడ్డి అంతకుముందు అన్నారు.