సీఎం రాజీనామా చేసినా ఫలితం ఉండదు:అశోక్ బాబు
ఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా ఇప్పుడు ఫలితం లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. లోక్ సభలో తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం చేసిన తమ పోరాటం వ్యర్థంగానే మిగిలిపోయిందన్నారు. బిల్లు ఆమోదం పొందిన తీరును ఆయన తప్పుబట్టారు. ఈ రోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే బాగుండేదన్నారు.
ఇక ఎవరు రాజీనామాలు చేసినా పెద్దగా లబ్ధి చేకూరదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ తరుణలో సీఎం రాజీనామా చేసినా ఫలితం ఉండదని అశోక్ బాబు తెలిపారు.