
కేంద్రమంత్రుల చేతగానితనం వల్లే విభజన
సీమాంధ్ర కేంద్ర మంత్రుల చేతగానితనం వల్లనే విభజన ప్రక్రియ ముందుకు వెళ్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అశోక్ బాబు ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో నేతలు సచివాలయంలో కలిశారు. విభజనకు సహకరిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా అశోక్ బాబు అన్నారు.
సీమాంధ్ర నేతలకు చేతకాకుంటే ఢిల్లీలోనే కూర్చోవాలని అశోక్‌బాబు విమర్శించారు. విభజనకు ఒప్పుకున్న సీమాంధ్ర నేతలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 24న సమైక్య జేఏసీ సమావేశంలో మలివిడత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.