రాజ్యసభ నామినేషన్ల చివరితేదీ సోమవారంతో ముగియనుండటంతో అమరావతి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనున్నా అభ్యర్థుల ఎంపికకు టీడీపీ కసరత్తు కొలిక్కిరాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావుతో నేడు భేటీ కానున్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వీరితో చర్చించనున్నట్లు సమాచారం.