rajya sabha seats
-
AP: రాజ్యసభ రేసులో బడా బాబులు!
వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య టీడీపీ ప్రలోభాలకు లొంగి పోయి తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో.. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ మూడు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీకి చెందిన బడా బాబులు పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలవంతులకే వీటిని కేటాయిస్తారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. పలువురు బిగ్ షాట్స్ ఇందుకోసం భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీకి చెందిన బడా బాబులు పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలవంతులకు వీటిని కేటాయిస్తారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. పలువురు బిగ్ షాట్స్ ఇందుకోసం భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యలను టీడీపీ నేతలు ప్రలోభాలతో లొంగదీసుకుని వారి సభ్యత్వాలకు రాజీనామా చేయించారు.దీని వెనుక భారీ డీల్ జరిగినట్లు గతంలోనే వెల్లడైంది. ఈ నేపథ్యంలో మోపిదేవి, బీద మస్తాన్‌రావు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ ముగ్గురి రాజీనామాలతో ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ముగ్గురి రాజీనామాలను ఆమోదింపజేయడంలో సహకరించినందుకు ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదనంగా మరింత రాబట్టేలా.. ముగ్గురిని రాజీనామా చేయించేందుకు పెట్టిన ఖర్చుతోపాటు అదనంగా మరింత రాబట్టేందుకు టీడీపీ ముఖ్య నేత పథకం రచించినట్లు తెలిసింది. ఎవరు ఎక్కువ ఆఫర్ ఇస్తే వారికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ రేసులో బీద మస్తాన్‌రావు ముందున్నట్లు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఒకరు వెల్లడించారు. ఎంతైనా ఇచ్చి తిరిగి సీటు దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తన స్థానం పదిలమని మస్తాన్‌రావు ఇప్పటికే సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. రేసులో ముందున్న సానా సతీష్ టీడీపీలో ఆరి్థకంగా బలవంతులైన నేతలు రాజ్యసభ సీటు కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఆరి్థకంగా అండదండలందించిన సానా సతీష్ పేరు దాదాపు ఖరారైనట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచి్చన నాటి నుంచి రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ఆయనకు సీటు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు చెబుతున్నారు.నారా లోకేశ్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కావడంతో ఆయన పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన మళ్లీ పార్లమెంటులో అడుగు పెట్టాలని ఉవి్వళ్లూరుతున్నారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్, గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీజీ వెంకటేష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా సరే భారీ ఆఫర్ ఇస్తేనే సీటు దక్కే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ మూడు స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇవ్వనున్నట్లు తెలిసింది. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
56 రాజ్యసభ స్థానాలకు 27న ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్నాయి. వాటికి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రానుంది. 15 వరకు నామినేషన్ల స్వీకరిరణ, 16న పరిశీలన, 20 వరకు ఉపసంహరణ ఉంటాయి. ఫిబ్రవరి 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. ఐదింటికి గంటలకు కౌంటింగ్ ముగించి ఫలితాలను ప్రకటిస్తారు. పదవీకాలం ముగుస్తున్న ఎంపీల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు తదితరులున్నారు. యూపీలో అత్యధికంగా 10 ఖాళీలు ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 ఉన్నాయి. బిహార్, మహారాష్ట్రల్లో చెరో 6, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్లో చెరో 5, కర్ణాటక, గుజరాత్లో చెరో 4, ఏపీ, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడేసి, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కోటి ఖాళీ అవుతున్నాయి. బీజేపీ పరం కానున్న 28 సీట్లు ఎన్నికలు జరిగే 56 రాజ్యసభ స్థానాల్లో 28 సీట్లను బీజేపీ గెలుచుకోనుంది. ప్రస్తుతం రాజ్యసభలో 93 మంది బీజేపీ సభ్యులతో కలిసి ఎన్డీఏ కూటమి బలం 114గా ఉంది. కాంగ్రెస్‌కు 30 సీట్లున్నాయి. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం దృష్ట్యా అక్కడి ఒక్క రాజ్యసభ స్థానం ఆ పార్టీకే దక్కనుంది. దాన్ని ప్రియాంక గాం«దీకి కేటాయించవచ్చని సమాచారం. ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా ఉన్న వహిస్తున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను మరో రాష్ట్రం నుంచి అధిష్టానం సర్దుబాటు చేయనుంది. -
ప్రారంభమైన వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఏపీలో ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మంగళవారం రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలిరోజు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఇక రాజ్యసభ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. వారు నలుగురూ బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈనెల 31వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వీటిని జూన్ 1న ఉ.11 గంటలకు పరిశీలిస్తారు. జూన్ 3వ తేదీ మ.3 గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నలుగురు అభ్యర్థుల కంటే ఎక్కువమంది పోటీలో ఉంటే జూన్ 10న ఉ.9 గంటల నుంచి మ.4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగు స్థానాలూ ఏకగ్రీవం! ఇక శాసనసభలో వైఎస్సార్సీపీకి 150 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీకి సాంకేతికంగా కేవలం 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే సగటున 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి అంత బలంలేని నేపథ్యంలో.. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎవరూ పోటీచేసే అవకాశంలేదు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. -
ఆఖరి నిమిషంలోనే ‘పెద్దల’ పేర్లు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను చేపట్టింది. బండా ప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12 నుంచి 19 వరకు కొనసాగనుంది. వచ్చే నెల 21న రాజ్యసభ సభ్యులుగా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజకీయ, సామాజికవర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. రాజ్యసభ ఉపఎన్నిక స్థానంలో పోటీ చేసే అభ్యర్థిని ఈ నెల 17 లేదా 18న, మరో రెండు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ నెల 25న ప్రకటించే అవకాశముంది. అయితే అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా, ఎంపికైనవారికే నేరుగా సమాచారం అందిస్తామని ఆశావహ నేతలకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవలి శాసనమండలి ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల ఎంపికలోనూ గోప్యత పాటించి చివరి నిమిషంలో అభ్యర్థులకు సమాచారం అందించారు. అదే వ్యూహాన్ని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ పాటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్థానాలకు వివిధ రంగాల ప్రముఖులు కూడా టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ప్రతిపాదకుల జాబితాలు సిద్ధం రాజ్యసభ అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కో నామినేషన్ సెట్‌పై తప్పనిసరిగా పదిమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా సంతకాలు చేయాలి. అభ్యర్థుల ఎంపికపై ఓ వైపు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తుండగా ప్రతిపాదకుల జాబితాను పార్టీ శాసనసభాపక్షం కార్యాలయం ద్వారా సిద్ధం చేసి నామినేషన్ సెట్లపై పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో అభ్యర్థి తరఫున కనీసం 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. టీఆర్ఎస్కు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయడంలో పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. రాజ్యసభ ఉపఎన్నిక స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి 2024 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయాలి. కొత్తగా ఎన్నికయ్యే మరో ఇద్దరు సభ్యుల పదవీకాలం 2028 జూన్‌లో ముగుస్తుంది. ఆరేళ్ల పదవీ కాలపరిమితి ఉన్న స్థానాల నుంచే తమను ఎంపిక చేయాలని ఆశావహులు కోరుతున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్కు చెందిన ఓ మాజీ ఎంపీ ఇదే వి షయాన్ని కేటీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం. -
మంత్రివర్గ విస్తరణ 22న?
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. -
ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజ్యసభలో నలుగురికి అవకాశం లభిస్తే అందులో రెండింటిని వెనకబడిన తరగతుల వారికి కేటాయించడం చరిత్రాత్మక సందర్భంగా చెప్పుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. బీసీల పట్ట చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారన్నారు. ప్రధానమైన రెండు వెనుకబడిన తరగతుల అగ్నికుల క్షత్రియ), పిల్లి సుభాష్‌చంద్రబోష్ (శెట్టిబలజ)లను రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇదొక చరిత్ర అని, సమైక్య రాష్ట్రంలో కూడా బీసీలకు ఇటువంటి అవకాశం రాలేదన్నారు. బీసీలపై జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడంలో చూపిన శ్రద్ధ చెప్పలేనిదన్నారు. రాష్ట్రంలో బీసీంతా హర్షించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన సమయంగా భావిస్తున్నానన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇచ్చారంటే ఎంత గొప్ప నిర్ణయమో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం బీసీల్లో ఉత్సాహం నింపిందని అభిప్రాయపడ్డారు. ఇదే టీడీపీ విషయానికి వస్తే ఏం చేసిందో అందరికీ తెలుసునన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీసీలకు ఎప్పుడైనా ఈ రకమైన గుర్తింపు, అవకాశాలు కలి్పంచిందా? అని ప్రశ్నించారు. టీడీపీ పల్లకీ మోసిన బీసీలను తొక్కేసారు తప్ప నిలబెట్టిన దాఖలాల్లేవన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఏలూరులో జరిగిన బీసీ సదస్సులో స్పష్టం చేశానన్నారు. బీసీలకు టీడీపీ చేసిన అన్యాయాన్ని, అధికారంలోకి వస్తే వైఎస్సార్సీపీ చేసే న్యాయాన్ని వివరించానని, ఇప్పుడది అమలు కావడంతో తనకెంతో గర్వంగా ఉందన్నారు. -
కీలక ఘట్టం; సగం బీసీలకే
-
సగం బీసీలకే; బోస్, మోపిదేవిలకు అవకాశం
సాక్షి, అమరావతి: బీసీల సాధికారత, సామాజిక న్యాయం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న వైఎస్సార్ సీపీ వారికి మరోసారి పెద్దపీట వేసింది. వైఎస్సార్ సీపీకి లభించే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండిటిని బీసీలకే కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారు. పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ పరిమల్ ధీరజ్‌లాల్ నత్వానీని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో పార్టీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సోమవారం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైఎస్సార్సీపీ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవడం ఖాయమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశం ఎవరికి దక్కుతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారు. నమ్ముకున్న వారికి అండగా.. పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులను రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయడం ద్వారా తాను బీసీ పక్షపాతినని, దివంగత వైఎస్సార్ తనయుడిగా నమ్మకున్న వారికి సదా అండగా ఉంటానని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఎమ్మెల్సీగా వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో మండపేట నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో కీలక స్థానం కల్పించారు. ఉపముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించారు. శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. అయోధ్య రామిరెడ్డి సేవలకు గుర్తింపు ప్రముఖ పారిశ్రామికవేత్త, రాంకీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో సామాజిక సమీకరణాల వల్ల ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉంటూ వచ్చిన ఆయన సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం నత్వానీకి అవకాశం విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ ధీరజ్‌లాల్ నత్వానీని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. ముఖేష్ అంబానీ ఇటీవల స్వయంగా తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా నత్వానీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రిని కోరారు. విధేయతకు పట్టం బీసీ వర్గానికే చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావు కూడా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడే. వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి ఉంటూ వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణారావుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. బీసీలు, పార్టీకి విధేయులుగా ఉన్నవారికి తప్పకుండా గుర్తింపు కల్పిస్తామని రుజువు చేశారు. రాష్ట్రాభివృద్ధికి దోహదం బీసీలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనమండలిలో పార్టీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వెల్లడించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సగం బీసీలకే కేటాయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వెనుకబడిన వర్గాల పట్ల నిబద్ధత చాటుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తామని ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రికి మాట ఇచ్చారని తెలిపారు. చరిత్రలో నిలుస్తుంది.. ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తారని మరోసారి రుజువైంది. ఒకేసారి ఇద్దరు బీసీ నాయకులను అత్యున్నత సభకు పంపించడం కీలక ఘట్టంగా ఏపీ చరిత్రలో నిలుస్తుంది. నా ఎదుగు దలకు దివంగత వైఎస్సార్ బీజం వేస్తే ఆయన తనయుడు, సీఎం జగన్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం కల్పించారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా. –మోపిదేవి వెంకటరమణారావు, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి ఊహించలేదు.. రాజ్యసభకు వెళతానని కలలో కూడా ఊహించలేదు. విశ్వసనీయతతో పనిచేసే వారికి పార్టీలో కచ్చితంగా సముచిత స్థానం లభిస్తుంది. పెద్దల సభకు ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. బీసీలకు పెద్దపీట వేసింది ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. – పిల్లి సుభాష్ చంద్రబోస్, డిప్యూటీ సీఎం ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నా కృతజ్ఞతలు. ఏపీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తాను. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉంటాను. –పరిమల్ నత్వానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ -
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు శుక్రవారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. నామినేషన్ పత్రాలు శాసనసభ కార్యదర్శి లేదా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పొందొచ్చు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ
-
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ
సాక్షి, అమరావతి: రాజ్యసభ నామినేషన్ల చివరితేదీ సోమవారంతో ముగియనుండటంతో అమరావతి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనున్నా అభ్యర్థుల ఎంపికకు టీడీపీ కసరత్తు కొలిక్కిరాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావుతో నేడు భేటీ కానున్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వీరితో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని అభ్యర్ధుల కసరత్తు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేవలం రెండు సీట్లకే పోటీచేయాలని టీడీపీ భావిస్తోంది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో తమ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తారని ఎస్సీ, బీసీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధానిలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఉండాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికతోపాటు టీటీడీ బోర్డు చైర్మన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. -
రాజ్యసభ సీట్లలో బీసీలకు మొండిచెయ్యి
టీడీపీపై 13 బీసీ సంఘాల ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యావంతులు, మేధావులు, సంఘసంస్కర్తలకు ఇవ్వాల్సిన రాజ్యసభ సీట్లను పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు ఇచ్చి రాజకీయాలను టీడీపీ భ్రష్టుపట్టిస్తోందని 13 బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. మంగళవారం ఆర్.కృష్ణయ్య(జాతీయ బీసీసంక్షేమ సంఘం), జాజుల శ్రీనివాస్‌గౌడ్ (బీసీ సంక్షేమ సంఘం), గుజ్జ కృష్ణ (బీసీ ప్రజాసమితి), జి.మల్లేష్‌యాదవ్(బీసీ ప్రంట్) రాంకోటి(బీసీ ఐక్యవేదిక), ర్యాగ రమేశ్ (బీసీ విద్యార్థి సంఘం), దుర్గాగౌడ్(బీసీ ఫెడరేషన్), సి.రాజేందర్(బీసీ హక్కుల పోరాటసమితి) ప్రొ.నటరాజ్ (బీసీ కులాల ఐక్యవేదిక), నీల వెంకటేశ్(బీసీ యువజన సంఘం), ఎ.పాండు(బీసీసేన), పి.శ్రీనివాస్ (బీసీ ఉద్యోగుల సంఘం), శారదగౌడ్ (బీసీ మహిళా సంఘం) ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీసీలకు టీడీపీ మొండిచేయి చూపిందని విమర్శించారు. బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, బీసీలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. -
‘ఎమ్మెల్సీగా గండ్రను నియమించాలి’
సాక్షి, హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రాజీనామాతో ఏర్పడిన ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ స్థానాన్ని హైకోర్టు తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావుకు కేటాయించాలని జూనియర్ న్యాయవాదుల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గండ్ర క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. -
57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్ విడుదల * మే 24న నోటిఫికేషన్; జూన్ 11న ఎన్నికలు * ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నిక సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యుల పదవీ కాలం జూన్-ఆగస్టు మధ్య పూర్తవుతున్నందున జూన్ 11న ఎన్నికల నిర్వహిస్తామని పేర్కొంది. పదవీ విరమణ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(బీజేపీ), జేడీ శీలం(కాంగ్రెస్), సుజనా చౌదరి, సీఎం రమేశ్(టీడీపీ)లు, తెలంగాణ నుంచి గుండు సుధారాణి(ప్రస్తుతం టీఆర్ఎస్), వి.హనుమంతరావు( కాంగ్రెస్)ల పదవీ కాలం ముగియనుంది. వీరితో పాటు కర్ణాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడి పదవీకాలం జూన్ 30తో పూర్తవుతుంది. ప్రముఖులు వీరే: పదవీకాలం పూర్తిచేసుకోబోతున్న ప్రముఖుల్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు(హర్యానా), గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌధురి బీరేందర్ సింగ్(హర్యానా), పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ(యూపీ), విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్(మహారాష్ట్ర), జేడీయూ నేత శరద్ యాదవ్(బిహార్)లు ఉన్నారు. కాంగ్రెస్ ప్రముఖుల్లో మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్(ఆంధ్రప్రదేశ్), మొహిసినా కిద్వాయ్(ఛత్తీస్‌గఢ్), ఆస్కార్ ఫెర్నాండెజ్ (కర్ణాటక), అంబికా సోనీ(పంజాబ్) తదితరులు ఉన్నారు. యూపీ నుంచి అత్యధికంగా 11 మంది పదవీ విరమణ చేస్తున్నవారిలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన వారు చెరో 14 మంది ఉండగా, బీఎస్పీకి చెందిన ఏడుగురు, జేడీయూ 5, ఎస్పీ, బీజేడీ, అన్నాడీఎంకేల నుంచి ముగ్గురు చొప్పున, డీఎంకే, ఎన్సీపీ, టీడీపీల నుంచి ఇద్దరేసి, శివసేన నుంచి ఒక్కరు ఉన్నారు. స్వతంత్ర సభ్యుడైన మాల్యా మే 5న రాజీనామా చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి 11, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి చెరో ఆరు, బిహార్ నుంచి 5, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి చెరో నాలుగు, మధ్యప్రదేశ్, ఒడిశా 3, హరియాణా, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి రెండేసి చొప్పున, ఉత్తరాఖండ్ నుంచి ఒక స్థానం ఖాళీ అవుతున్నాయి. 24 ఏళ్ల తర్వాత మళ్లీ సాఫీగా... న్యూఢిల్లీ: బుధవారం ముగిసిన 16వ లోక్‌సభ 8వ సమావేశాలు కొత్త చరిత్ర సృష్టిం చాయి. సభలో అవాంతరాలతో ఒక్క నిమి షం కూడా వాయిదా పడకుండా సాఫీ గా సాగటం 24 ఏళ్లలో ఇదే తొలిసారి అని లోక్‌సభ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో 1990, 1992లో మాత్ర మే దిగువసభ ఇంత సాఫీగా సాగిం దన్నారు. ‘1992లో పదో లోక్‌సభ మూడో సమావేశాల్లో.. శివరాజ్‌పాటిల్ స్పీకర్‌గా ఉన్నపుడు 49 సార్లు భేటీ అయిన సభ అవాంతరాల్లేకుండా సాగింది. 1990లో తొమ్మిదో లోక్‌సభ రెండో సమావేశాల్లో.. రబీరే స్పీకర్‌గా ఉన్నపుడూ వాయిదాల్లేకుండా సాగింది’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్ సిట్టిం గ్ సభ్యుడు ప్రవీణ్ రాష్ట్రపాల్ మృతికి సం తాపం తెలుపుతూ రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. పదవీ విరమణచేసిన 58 మందికి వీడ్కోలు అనంతరం శుక్రవారం నిరవధిక వాయిదా వేయనున్నారు. -
ఆ ఇద్దరు ఎవరు?
* రాజ్యసభ అవకాశంపై టీఆర్ఎస్లో మొదలైన అలజడి * రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న గుండు సుధారాణి, వీహెచ్‌ల స్థానాలు * ఈ రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం టీఆర్ఎస్కే! * ప్రయత్నాల్లో గులాబీ సీనియర్లు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభకు ఎన్నికల నగారా మోగడంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో అలజడి మొదలైంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి. హనుమంతరావు (వీహెచ్), గుండు సుధారాణిల పదవీకాలం జూన్ 21తో ముగుస్తోంది. రాష్ట్రానికి వచ్చే ఈ రెండు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ హోదాలో తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా టీఆర్ఎస్ తేలిగ్గా గెలుచుకునే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీంతో ఆ రెండు స్థానాలు దక్కేదెవరికన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే గత రెండు మూడు నెలలుగా పలువురు నేతలు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలసి రాజ్యసభ కోసం విజ్ఞప్తులు చేసుకున్నారు. ఉన్న స్థానాలు రెండే అయినా పార్టీలోని పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. వివిధ రాజకీయ సమీకరణలు, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారన్నది పార్టీ వర్గాల సమాచారం. తొలి నుంచీ పార్టీలో కొనసాగిన వారు, కష్టకాలంలో ఆదుకున్న వారు, పార్టీ కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలిచిన వారు, అనివార్య పరిస్థితుల వల్ల అవకాశాలు దక్కని వారు.. ఇలా పలు కోణాల్లో ఆలోచించి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక వారి పేర్లను ప్రకటించడమే మిగిలి ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెరపైకి పలువురి పేర్లు! పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు రాజ్యసభ రేసులో టీఆర్ఎస్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారితోపాటు ఇతర పార్టీల నుంచి చేరిన నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నిక సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్కు వలస వచ్చిన గుండు సుధారాణి తనకు తిరిగి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఆమె తరఫున అధినేతపై ఒత్తిడి తేగల నాయకులెవరూ లేరని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్‌గా పనిచేసి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్నారు. పార్టీ మారే సమయంలోనే రాజ్యసభ సీటు ఇచ్చే హామీతో వచ్చారన్న ప్రచారం జరిగింది. ఇక హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి ఆయనకు గౌరవం ఇచ్చేలా రాజ్యసభకు పంపిస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. అధినేత ఎక్కడికి పంపితే అక్కడ పనిచేస్తానని నాయిని ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా. ఇక కేసీఆర్‌కు సన్నిహితులుగా పేరున్న కరీంనగర్‌కు చెందిన మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.దామోదర్‌రావుల పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దామోదర్‌రావుకు పక్కాగా రాజ్యసభ అవకాశం ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వీరే కాకుండా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న రామచంద్రుడు కూడా ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు కూడా ప్రచారంలో ఉండడం గమనార్హం. -
కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
-
కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
బిహార్ అంటే... అందునా లాలు ప్రసాద్ అంటే కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన ఇద్దరు కొడుకులు రాష్ట్రంలో మంత్రులు. అందులోనూ చిన్నకొడుకు ఉప ముఖ్యమంత్రి కూడా. అయితే, ఇంతకుముందు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన భార్య, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తన కూతురు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా ఎందుకు ఉండాలి అనుకున్నారేమో గానీ.. వాళ్లిద్దరినీ రాజ్యసభకు పంపాలని లాలు నిర్ణయించేశారు. వచ్చే సంవత్సరం బిహార్ నుంచి రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి వీళ్లిద్దరినీ ఎంపిక చేశారు. రబ్రీదేవికి, మీసా భారతికి రాజ్యసభ సీట్లు ఖాయమని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుచుకోవడంతో ఆర్జేడీ సులభంగా రెండు రాజ్యసభ స్థానాలను పొందుతుంది. ఒక్కో అభ్యర్థికి అసెంబ్లీ నుంచి కేవలం 41 ఓట్లు వస్తే చాలు. అంటే, మిత్రపక్షాలైన జేడీ(యూ) లేదా కాంగ్రెస్ నుంచి ఇద్దరు తమవాళ్లకు ఓట్లేస్తే చాలని లాలు చూస్తున్నారు. జేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎంపీలు 2016 జూలైలో రిటైర్ కానున్నారు. తాను జాతీయస్థాయిలో పనిచేస్తానని, తమ్ముడు నితీష్ బిహార్‌ను చూసుకుంటాడని లాలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కావాలి గానీ.. తాను ఎటూ ఎన్నిక కాలేడు కాబట్టి భార్యను, కూతురిని పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రబ్రీదేవి ఎటూ మాజీ సీఎం కాబట్టి, ఆమెకు పెద్ద బంగ్లానే వస్తుంది. మీసాభారతి మాత్రం రాజకీయ పదవి పొందడం ఇదే తొలిసారి అవుతుంది. అది కూడా నేరుగా రాజ్యసభకు వెళ్లడం విశేషం. 2014 ఎన్నికల్లో ఆమె పాటలీపుత్ర స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసింది. కానీ, అప్పటివరకు లాలుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన రామ్ కృపాల్ బీజేపీలోకి వెళ్లి, ఆమెను ఓడించారు. కానీ మీసాభారతిని ఎలాగైనా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న లాలు.. ఇప్పుడు అవకాశం రావడంతో పెద్దల సభకు పంపేస్తున్నారు. -
రాజ్యసభ ఖాళీ సీట్ల ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్
ఏపీలో నేదురుమల్లి మరణంతో ఖాళీ అయిన స్థానం న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంతో పాటు.. మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు జూలై 3న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా నేదురుమల్లి గత నెల 9వ తేదీన చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన స్థానాన్ని రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ స్థానంతో పాటు తమిళనాడులో టి.ఎం.సెల్వగణపతి మరణంతో ఖాళీ అయిన స్థానం.. ఒడిశాలో శశిభూషణ్‌బెహ్రా, రబినారాయణ్ మహాపాత్రల రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కలిపి మొత్తం నాలుగు స్థానాల ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల తుది గడువు ఈ నెల 23వ తేదీగా ప్రకటించింది. నామినేషన్ల పరిశీలనకు 24వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. వచ్చే నెల (జూలై 3న) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని పేర్కొంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించింది. -
ధర బాగానే పలికిందట..
టీడీపీలో రాజ్యసభ సీట్లకు ధర బాగానే పలికిందట. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పాదయాత్ర, మీకోసం బస్సుయాత్ర కార్యక్రమాల్లో వెన్నంటి నడచిన గరికపాటి మోహన్వుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. ఇద్దరూ ఆర్థికంగా స్థితిమంతులే. దాంతో టీ, టిఫిన్లు ఖాయమని కొందరు ఎమ్మెల్యేలు భావించారట. కానీ అలాంటిదేమీ లేకుండానే చంద్రబాబు మాక్ పోలింగ్ నిర్వహించి మరీ వారికి పకడ్బందీగా ఓట్లు వేయించారు. గతంలో పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లిన ఒక నాయకుడు తన పదవీకాలం ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వీడ్కోలు సభ సందర్భంగా కొత్త అభ్యర్థి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందట. పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం చాయ్ కూడా తాగించకుండానే పెద్దల సభలో అడుగుపెట్టానని, ఆ క్రెడిట్ పార్టీ అధినేతకు దక్కుతుందంటూ రిటై రవుతున్న నాయకుడు చెప్పుకొచ్చారు. అయితే బాబు ఆశీస్సులు ఏంటా? అని కొందరు తెలుగు తమ్ముళ్లు ఆరాతీసి ముక్కున వేలేసుకున్నారట. గతంలో జరిగినట్టే ఇటీవల జరిగిన రెండు రాజ్యసభ సీట్లలో ఒక అభ్యర్థికి రూ.30 కోట్ల వరకు ఖర్చయిందట. మరో అభ్యర్థికి 20 కోట్లపైనే చెల్లించుకోవలసి వచ్చిందట. వీటిని పార్టీ చందా కింద సమర్పించారట. అవును.. మీకెవరికీ చాయ్ కూడా తాగించలేదు. కానీ ధర భాగానే పలికింది బాబూ.. అని కొత్త అభ్యర్థి అసలు విషయం చెప్పడంతో ఎమ్మెల్యేలు కిమ్మనకుండా ఉండిపోయారట. -
రాజ్యసభ స్థానాలకు.. 16 ఏళ్ల తరువాత పోలింగ్
రేపే అసెంబ్లీ కమిటీ హాల్ 1లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 16 ఏళ్ల అనంతరం రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. 1998లో రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఏడుగురు పోటీపడటంతో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికలన్నీ ఏకగ్రీవమయ్యాయి. మళ్లీ ఈసారి పోలింగ్ జరుగుతోంది. ఈసారి కూడా ఆరు స్థానాలకు ఏడుగురు రంగంలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్ నె ంబర్ 1లో పోలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారని అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి డాక్టర్ రాజసదారాం తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, అది పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాసన సభ్యుల సంఖ్య 294. ఆంగ్లో ఇండియన్ కోటా కింద నియమితులయ్యే ఎమ్మెల్యేకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. ప్రస్తుతం అసెంబ్లీలో 15 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా ఎమ్మెల్యేల్లో సుమన్ రాథోడ్ (టీడీపీ), జనార్దన్ థాట్రాజ్ (కాంగ్రెస్), సీహెచ్ రమేష్ (టీఆర్ఎస్)లకు కోర్టు ఆదేశాలతో ఓటు హక్కు లేదు. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో 276 మంది ఎమ్మెల్యేలు ఓటువేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, టీడీపీ నుంచి గరికపాటి మోహన్‌రావు, సీతారామలక్ష్మి, టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా బరిలో ఉన్నారు. 2003 ప్రజాప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణను అనుసరించి రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. అభ్యర్థులను నిలబెట్టిన ప్రతి పార్టీ తరఫున పోలింగ్ బూత్‌లో ఒక ఏజెంటు ఉంటారు. ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తున్నారో తమ పార్టీ ఏజెంటుకు తప్పనిసరిగా చూపించాలి. లేనిపక్షంలో ఆ ఓటు పోల్ కాదు. ఈసారి అసెంబ్లీ సమావేశం లేకపోవడంతో ఎమ్మెల్యేలు కేవలం ఓటు వేసి వెళ్లనున్నారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి: ఆదాల ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యానికి ఓటువేయడం ద్వారా ఎమ్మెల్యేలు తమ గళాన్ని గట్టిగా వినిపించాలని అన్నారు. -
టీడీపీ అభ్యర్థుల ప్రకటన నేడు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం పోలిట్ బ్యూరో భేటీ అనంతరం ప్రకటించే అవకాశముంది. టీడీపీకి రెండు స్థానాలు లభించే అవకాశం ఉండడంతో.. ఒక స్థానానికి పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. మరో స్థానం కోసం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున ్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు లేదా పార్టీ నేత బక్కని నర్సింహులు, సీమాంధ్ర నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణల్లో ఎవరో ఒకరిని ఖరారు చేసే అవకాశమున్నట్టుగా చెబుతున్నారు. మోత్కుపల్లి అభ్యర్థిత్వాన్ని పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బక్కని నర్సింహులు పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఖర్చులు భరించేలా... నారాయణకు బెర్తు ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. ఆయనకు అవకాశం దక్కనిపక్షంలో.. మాజీ స్పీకర్ కె.ప్రతిభాభారతి, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్టీ నేత దాసరి రాజామాస్టార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
అధిష్టానం మల్లగుల్లాలు
-
రంజుగా మారుతున్న రాజ్యసభ ఎన్నికలు