సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజ్యసభలో నలుగురికి అవకాశం లభిస్తే అందులో రెండింటిని వెనకబడిన తరగతుల వారికి కేటాయించడం చరిత్రాత్మక సందర్భంగా చెప్పుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. బీసీల పట్ట చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించుకున్నారన్నారు. ప్రధానమైన రెండు వెనుకబడిన తరగతుల అగ్నికుల క్షత్రియ), పిల్లి సుభాష్‌చంద్రబోష్ (శెట్టిబలజ)లను రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇదొక చరిత్ర అని, సమైక్య రాష్ట్రంలో కూడా బీసీలకు ఇటువంటి అవకాశం రాలేదన్నారు. బీసీలపై జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బీసీల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడంలో చూపిన శ్రద్ధ చెప్పలేనిదన్నారు. రాష్ట్రంలో బీసీంతా హర్షించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన సమయంగా భావిస్తున్నానన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇచ్చారంటే ఎంత గొప్ప నిర్ణయమో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం బీసీల్లో ఉత్సాహం నింపిందని అభిప్రాయపడ్డారు. ఇదే టీడీపీ విషయానికి వస్తే ఏం చేసిందో అందరికీ తెలుసునన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీసీలకు ఎప్పుడైనా ఈ రకమైన గుర్తింపు, అవకాశాలు కలి్పంచిందా? అని ప్రశ్నించారు. టీడీపీ పల్లకీ మోసిన బీసీలను తొక్కేసారు తప్ప నిలబెట్టిన దాఖలాల్లేవన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఏలూరులో జరిగిన బీసీ సదస్సులో స్పష్టం చేశానన్నారు. బీసీలకు టీడీపీ చేసిన అన్యాయాన్ని, అధికారంలోకి వస్తే వైఎస్సార్‌సీపీ చేసే న్యాయాన్ని వివరించానని, ఇప్పుడది అమలు కావడంతో తనకెంతో గర్వంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment