సాక్షి, హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రాజీనామాతో ఏర్పడిన ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ స్థానాన్ని హైకోర్టు తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావుకు కేటాయించాలని జూనియర్ న్యాయవాదుల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గండ్ర క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు.