కేసీఆర్ మొక్కులపై పిల్ విచారణకు స్వీకరణ
వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇటీవల పలు దేవస్థానాలకు మొక్కుల కింద బంగా రు ఆభరణాలను సమర్పించడంపై దాఖలైన పిల్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరిం చింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ సీఎస్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
సీఎం తన వ్యక్తిగత మొక్కులను కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు చెందిన కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి తీర్చుకున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని విశ్రాంత ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సామాజిక కార్యకర్త గుండ మాల రాములు వేసిన పిల్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపి స్తూ, ఏఏ దేవస్థానాలకు మొక్కులు చెల్లిం చారో వివరించారు. ఈ క్రమంలో సీజీఎఫ్ గురించి ధర్మాసనం ఆరా తీసింది.