సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్లో ఖాళీ అవుతున్నాయి. వాటికి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రానుంది.
15 వరకు నామినేషన్ల స్వీకరిరణ, 16న పరిశీలన, 20 వరకు ఉపసంహరణ ఉంటాయి. ఫిబ్రవరి 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. ఐదింటికి గంటలకు కౌంటింగ్ ముగించి ఫలితాలను ప్రకటిస్తారు. పదవీకాలం ముగుస్తున్న ఎంపీల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు తదితరులున్నారు.
యూపీలో అత్యధికంగా 10 ఖాళీలు
ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 ఉన్నాయి. బిహార్, మహారాష్ట్రల్లో చెరో 6, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్‌లో చెరో 5, కర్ణాటక, గుజరాత్‌లో చెరో 4, ఏపీ, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడేసి, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కోటి ఖాళీ అవుతున్నాయి.
బీజేపీ పరం కానున్న 28 సీట్లు
ఎన్నికలు జరిగే 56 రాజ్యసభ స్థానాల్లో 28 సీట్లను బీజేపీ గెలుచుకోనుంది. ప్రస్తుతం రాజ్యసభలో 93 మంది బీజేపీ సభ్యులతో కలిసి ఎన్డీఏ కూటమి బలం 114గా ఉంది. కాంగ్రెస్‌కు 30 సీట్లున్నాయి. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం దృష్ట్యా అక్కడి ఒక్క రాజ్యసభ స్థానం ఆ పార్టీకే దక్కనుంది. దాన్ని ప్రియాంక గాం«దీకి కేటాయించవచ్చని సమాచారం. ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా ఉన్న వహిస్తున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను మరో రాష్ట్రం నుంచి అధిష్టానం సర్దుబాటు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment