సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించడానికి ఈసీ బృందం ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపు, భద్రతా బలగాల మోహరింపు, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సమీక్షలు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘం అధికారులు కేంద్రం హోం శాఖ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపారు. దాదాపు 97 కోట్ల మంది ఓటర్ల కోసం దేశమంతటా దాదాపు 12.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఆరు నుంచి ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment