General Election schedule
-
ఏపీ ఎన్నికల షెడ్యూల్..అప్పుడు తరిమేసి..ఇప్పుడు సీఎం చేస్తాడంటా..
-
Lok sabha elections 2024: ఎన్నికల షెడ్యూల్ నేడే
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ వెలువడనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను సైతం ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి(కంటోన్మెంట్) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ రెండు లేక మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుంది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. అంతకంటే ముందు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. ఈసారి నాలుగు నుంచి ఐదు దశల్లోనే లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల కోసం 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై మధ్యాహ్నాం 3 గంటలకు స్పష్టత రానుంది. -
13 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించడానికి ఈసీ బృందం ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపు, భద్రతా బలగాల మోహరింపు, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సమీక్షలు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘం అధికారులు కేంద్రం హోం శాఖ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపారు. దాదాపు 97 కోట్ల మంది ఓటర్ల కోసం దేశమంతటా దాదాపు 12.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఆరు నుంచి ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
తేల్చేది మార్పులే
సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుద లైంది. ప్రస్తుతం రాజకీయ అస్పష్టత నేపథ్యంలో నాయకుల్లో ఇప్పటికే టెన్షన్ నెల కొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చే ఎన్నికల్లో పార్టీల మధ్య అవగాహనలు, పొత్తుల వంటి కారణాలతో పోటీ చేసే నాయకులు గందరగోళంలో ఉన్నారు. వీటన్నింటికీ తోడు నియోజకవర్గాల వారీగా జరిగిన ఓటర్ల జాబి తాల్లో మార్పులు-చేర్పులు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నారుు. గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ ఎంత... ఎవరెవరు ఎటు వేశారు.. వంటి అంశాలు, జయాపజయాల తీరును బేరీజు వేసుకునే ఎవరైనా ముందుకెళుతారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్నమార్పులు ఆయూ నియోజకవర్గాల్లోని అభ్యర్థులను అయోమయంలోకి నెట్టారుు. నూతన ఓటర్లదే ప్రభావం... 2009 సాధారణ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. నేతల చతురతతోపాటు రాజకీయ పొత్తులతో అవకాశాలు కోల్పోయిన వారు పోటీకి దిగడం వంటి కారణాలతో ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వారి మెజార్టీ తక్కువగానే ఉంది. 2009లో కొత్తగా ఓటు హక్కు పొందిన వారే గెలుపోటములను ప్రభావితం చేశారు. ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపైనే అందరూ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వారి మనసులో ఏముందో... 2009లో జిల్లావ్యాప్తంగా మొత్తం 24,46, 551 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత జాబి తా ప్రకారం 24,96,622 మంది ఓట ర్లు ఉన్నట్లు తేలింది. గత ఎన్నికలతో పోల్చి తే జిల్లాలో కొత్తగా ఓటు హక్కు పొందిన వా రు 50,071 మంది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో వీరి తీర్పే కీలకంగా మారనున్నట్లు స్పష్టమవుతోంది. తమతమ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటు వేసే వారి మనసులో ఏముంది... వారి మెప్పు పొందడం ఎలా అనే పనిలో నేతలు నిమగ్నమయ్యూరు. గత ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడిన వారు వీరి ఆదరణ విషయంలో ప్రత్యేక కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు. ఎనిమిది సెగ్మెంట్లలో పెరిగింది... జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. వరంగల్ పశ్చిమలో 2009లో గెలిచిన దాస్యం వినయ్‌భాస్కర్‌కు 6,684 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పటి ఎన్నికలతో పోల్చితే ఈ నియోజకవర్గంలో 17,791 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. మెజార్టీకి మూడు రెట్లుగా ఉన్న ఈ ఓటర్లతో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉండనుంది. ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి, డోర్నకల్, పాలకుర్తి సెగ్మెంట్లలో పెరిగిన ఓటర్ల సంఖ్యను గమనిస్తే... ఇలాంటి పరిణామాలే దారితీయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాలుగు చోట్ల తగ్గింది... వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, జనగామ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. ఈ అంశమే అక్కడ పోటీ చేయనున్న నాయకుల్లో ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామలో 2009తో పోల్చితే ప్రస్తుతం 2,331 మంది ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 236 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇప్పుడు తగ్గిన ఓటర్లు... గత ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించిన వారై ఉంటారనేది మంత్రితోపాటు ఆయన ప్రత్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. వరంగల్ తూర్పు సెగ్మెంట్లో మరో మంత్రి బస్వరాజు సారయ్యకు 2009 ఎన్నికల్లో 7,255 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఈ సెగ్మెంట్లో 15,191 ఓట్లు తగ్గాయి. ఇలా తగ్గిన ఓట్లు మంత్రికి చేటు చేస్తాయా... ఆయన ప్రత్యర్థులకు లబ్ధి చేకూరుస్తాయూ... అనేది ఆసక్తికరంగా మారనుంది. -
డీసీసీ అధ్యక్షులతో భేటీ అరుున బొత్స
-
అంతా అయోమయం..
ఒకవైపు ఖాళీ అవుతున్న పార్టీ.. మరోవైపు పోటీకి అభ్యర్థులే లేని పరిస్థితి డీసీసీ అధ్యక్షులతో భేటీ అరుున బొత్స కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదన్న నేతలు సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని ప్రచారం చేస్తున్న సమయంలో లోక్‌సభతో పాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకూ షెడ్యూల్ విడుదల కావడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఒకవైపు మున్సిపల్, మరోవైపు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడమెలాగో వారికి అంతుబట్టడం లేదు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోవడం, పార్టీకి పెద్ద దిక్కంటూ లేకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు వారిని బెంబేలెత్తిస్తున్నారుు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటం, ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు చివరివరకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సమయంలో ఎన్నికలను ఎదుర్కోలేమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ వంటి పార్టీలతో పొత్తుకు అవకాశమున్నప్పటికీ సీమాంధ్రలో ఆ దారి కూడా లేదని వాపోతున్నారు. ఇటీవలి అనేక సర్వేలు సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని పేర్కొనడం నేతల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ తరఫున పోటీ చేయకుండా ముఖం చాటేసే యోచనలో ఉన్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ పెద్దలకు నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఆయనకు పలు సూచనలు అందినట్లు సమాచారం. సీమాంధ్రకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని హైకమాండ్ సూచించింది. అందరిలోనూ నిరాశ, నిస్పృహే: ఈ నేపథ్యంలోనే బుధవారం బొత్స సీమాంధ్ర ప్రాంత డీసీసీల అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర నేతలతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ అంశాలపై చర్చించారు. జిల్లాల్లో పరిస్థితిపైనా ఆరా తీశారు. పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఈ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయమని నేతలంతా ముక్తకంఠంతో చెప్పారు. రాష్ట్ర విభజన పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసిందన్నారు. లోక్‌సభ బరిలో తాజా మాజీ మంత్రులు: రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర తాజా మాజీ మంత్రులను ఆ ప్రాంతంలో లోక్‌సభ అభ్యర్థులుగా పోటీ చేయించే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు బొత్స చెప్పారు. తాజా మాజీ మంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే సీమాంధ్రలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌కు కొంత ఊపు వస్తుందని, పదేళ్లుగా అధికారంలో ఉన్నందున అంగ, అర్ధబలంతో జనాన్ని సమీకరించగలరని డీసీసీల నేతలు సూచించడంతో బొత్స ఈ విషయం వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, డీసీసీ ప్రతినిధులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.