సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్‌ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment