
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు శుక్రవారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. నామినేషన్ పత్రాలు శాసనసభ కార్యదర్శి లేదా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పొందొచ్చు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment